ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
ACB Raids | భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ (Bhupalpally Mains AD) జయరాజ్ నివాసాలు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ (Bhupalpally Mains AD) జయరాజ్ నివాసాలు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) బోడుప్పల్‌లోని జయరాజు నివాసంతోపాటు సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సోదాల్లో ఇప్పటివరకు రెండు అంతస్తుల భవనం, రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు బైకులు, జనగామ జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు, బంగారు నగలు, బ్యాంకులో రూ.60 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతన్నాయి. సోదాల అనంతరం ఆస్తుల విలువ, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఇతర వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా మాఫియాతో చేతులు కలిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమదారులతో కుమ్మక్కై భారీగా డబ్బు కూడగట్టినట్లు తెలుస్తున్నది.

సంబంధిత వార్తలు

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
ఆగస్టు 26, 2026

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం
ఆగస్టు 26, 2026

Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం... వీడియోలు
- ●KTR | మీ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు స్ఫూర్తి.. కేటీఆర్‌కు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..
- ●Nepal Flash Floods | నేపాల్ జల ప్రళయం.. 300 మంది భారతీయులు గల్లంతు.. పొంచి ఉన్న మరో ముప్పు
- ●Bill Gates | కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐకి ఇవ్వొద్దు.. బిల్ గేట్స్ హెచ్చరిక..

Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్

Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం... వీడియోలు

KTR | మీ ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు స్ఫూర్తి.. కేటీఆర్‌కు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆహ్వానం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..



