త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU Convocation | రేపే ఓయూ స్నాత‌కోత్స‌వం.. సాయంత్రం 6 గంట‌ల‌కు కూడా అంద‌ని ఐడీ కార్డులు

OU Convocation | ఉస్మానియా యూనివ‌ర్సిటీ 85వ స్నాత‌కోత్స‌వం సెప్టెంబ‌ర్ 8న జ‌ర‌గ‌నుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా చ‌కాచ‌కా కొన‌సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం జ‌రిగే స్నాత‌కోత్స‌వంలో 640 మంది స్కాల‌ర్స్ పీహెచ్‌డీ ప‌ట్టాల‌ను, 71 మంది గోల్డ్ మెడ‌ల్స్‌ను అందుకోనున్నారు.

S

Hyderabad | Published On Sep 7, 2026, 8.22 pm IST

OU Convocation | రేపే ఓయూ స్నాత‌కోత్స‌వం.. సాయంత్రం 6 గంట‌ల‌కు కూడా అంద‌ని ఐడీ కార్డులు
Advertisement

OU Convocation | త్రినేత్ర‌.న్యూస్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ 85వ స్నాత‌కోత్స‌వం సెప్టెంబ‌ర్ 8న జ‌ర‌గ‌నుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా చ‌కాచ‌కా కొన‌సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం జ‌రిగే స్నాత‌కోత్స‌వంలో 640 మంది స్కాల‌ర్స్ పీహెచ్‌డీ ప‌ట్టాల‌ను, 71 మంది గోల్డ్ మెడ‌ల్స్‌ను అందుకోనున్నారు.

అయితే గోల్డ్ మెడ‌ల్స్‌కు ఎంపికైన విద్యార్థులు.. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఎగ్జామినేష‌న్ బ్రాంచ్‌కు చేరుకొని ఐడీ కార్డులు పొందాల‌ని ఓయూ అధికారులు సూచించారు. దీంతో బంగారు ప‌థ‌కం విజేతలంద‌రూ కూడా సుదూర ప్రాంతాల నుంచి త‌మ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి 10 గంట‌ల క‌ల్లా ఓయూ ఎగ్జామినేష‌న్ బ్రాంచ్‌కు చేరుకున్నారు.

ఐడీ కార్డ్స్ పంపిణీకి ఓ 30 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెప్పారు. 11 గంట‌ల వ‌ర‌కు ఐడీ కార్డులు పంపిణీ చేస్తామ‌న్నారు. కానీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కూడా ఐడీ కార్డులు జారీ చేయ‌లేదు. ఈ స‌మ‌యానికి కేవ‌లం ఆహ్వాన ప‌త్రిక‌లు మాత్ర‌మే అంద‌జేశారు. ఐడీ కార్డుల జారీకి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని విద్యార్థుల‌కు అధికారులు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఓ విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ.. తాము తమ బిడ్డ‌తో క‌లిసి చాలా దూరం నుంచి వ‌చ్చాము. 10 నుంచి 15 నిమిషాల్లో ఐడీ కార్డు జారీ చేస్తార‌నుకున్నాం. కానీ ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వేచి చూశాం. అయినా కూడా కార్డులు ఇవ్వ‌కుండా, ఆహ్వాన ప‌త్రిక‌లు మాత్ర‌మే అంద‌జేశారు. ఐడీ కార్డుల కోసం వేచి చూడాల్సి వ‌స్తుంద‌ని అత‌ను వాపోయాడు.

యూనివర్సిటీ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, స్నాతకోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కమిటీల మధ్య సమన్వయ లోపం వ‌ల్లే ఐడీ కార్డుల పంపిణీ స‌కాలంలో జ‌ర‌గ‌లేద‌ని తెలిసింది. ప్రింటింగ్ విభాగం ద్వారా ఐడీ కార్డులు ఇప్పటికే ముద్రించబడినప్పటికీ, అవి సకాలంలో ఎగ్జామినేష‌న్ బ్రాంచ్‌కు చేర‌లేద‌న్నారు. స‌మ‌న్వ‌య లోపం వ‌ల్లే ఇలా జ‌రిగిందని, చివ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement