Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్
Vinayaka Chavithi | మండపాల్లో గణనాథులు కొలువుదీరితే చాలు.. కర్ణబేరి పగిలిపోయేలా సౌండ్ బాక్సులు పెట్టి హంగామా చేస్తుంటారు. డీజేలతో స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో.. డీజే యజమానులకు అత్తాపూర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Vinayaka Chavithi | త్రినేత్ర.న్యూస్ : మండపాల్లో గణనాథులు కొలువుదీరితే చాలు.. కర్ణబేరి పగిలిపోయేలా సౌండ్ బాక్సులు పెట్టి హంగామా చేస్తుంటారు. డీజేలతో స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో.. డీజే యజమానులకు అత్తాపూర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రెండు సౌండ్ బాక్సులకే అనుమతి ఇస్తున్నామని, అంతకు మించి ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణేష్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డిజే (DJ) సౌండ్ సిస్టమ్ యజమానులతో ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను వివరంగా తెలియజేశారు. ఉత్సవాల్లో శబ్ద కాలుష్యాన్ని అదుపు చేసేందుకు డిజే (DJ) సౌండ్ సిస్టమ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని స్పష్టం చేశారు.
మార్గదర్శకాలు ఇలా..
- నిబంధనల ప్రకారం ప్రార్థనా ప్రదేశాలు, ఊరేగింపులలో కేవలం రెండు సాధారణ సౌండ్ బాక్సులను మాత్రమే పరిమిత శబ్ద తీవ్రతతో ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
- భారీ డిజే సిస్టమ్‌లు, సౌండ్ వాల్స్ వినియోగించడం చట్టరీత్యా నేరం.
- ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి డిజే సిస్టమ్‌లను ఏర్పాటు చేసినా లేదా శబ్ద కాలుష్యానికి పాల్పడినా సంబంధిత డిజే యజమానులు, ఉత్సవ నిర్వాహకులపై చట్టరీత్యా కఠినమైన కేసులు నమోదు చేయడమే కాకుండా, సౌండ్ పరికరాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Heavy Rains | మండపాల్లో వినాయకులు జాగ్రత్త.. ఎందుకంటే..?
- ●Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్ లెహంగాలో అదుర్స్!
- ●Neelakurinji Flowers Munnar | 12 ఏళ్ల నిరీక్షణ: మున్నార్‌లో మళ్లీ వికసించిన నీలకురింజి పూలు.. ఇప్పుడే చూడకపోతే మళ్లీ 2038లోనే!
- ●SC, ST Commission | 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం
- ●KTR | వలువలు విప్పుతున్నానన్న రేవంత్‌రెడ్డి.. విలువల గురించి మాట్లాడుతున్నడు : కేటీఆర్
- ●DGP CV Anand | 14 నుంచి గణేశ్ ఉత్సవాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే : డీజీపీ సీవీ ఆనంద్

Heavy Rains | మండపాల్లో వినాయకులు జాగ్రత్త.. ఎందుకంటే..?

Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్ లెహంగాలో అదుర్స్!

Neelakurinji Flowers Munnar | 12 ఏళ్ల నిరీక్షణ: మున్నార్‌లో మళ్లీ వికసించిన నీలకురింజి పూలు.. ఇప్పుడే చూడకపోతే మళ్లీ 2038లోనే!

SC, ST Commission | 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశం





