త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

TTD | టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ దాత కుంచాల మధురాం రెడ్డి రూ.1.11 కోట్ల భారీ విరాళాన్ని అందించారు.

S

Telangana | Published On Sep 7, 2026, 8.47 pm IST

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
Advertisement

హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన కుంచాల మధురాం రెడ్డి విరాళం

TTD | త్రినేత్ర‌.న్యూస్ : టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డి రూ.1.11 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి దాత ఈ విరాళాన్ని అందజేశారు. గోసంరక్షణ, గోసేవకు పెద్దపీట వేస్తున్న టీటీడీకి అండగా నిలిచి, భారీ విరాళం అందించిన దాత కుంచాల మధురాం రెడ్డిని చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. గోవుల సంరక్షణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, భక్తులు, దాతల సహకారంతో టీటీడీ గోసంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందని తెలిపారు.

Advertisement
Advertisement