త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజ‌రు కానున్న 24 వేల మంది టీచ‌ర్లు

TG TET | ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ఉత్తీర్ణ‌త పొంద‌ని ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా టెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 8, 9 తేదీల్లో జ‌రిగే ఈ అర్హ‌త ప‌రీక్ష‌కు 24,986 మంది టీచ‌ర్లు హాజ‌రు కానున్నారు.

S

Telangana | Published On Sep 7, 2026, 10.09 pm IST

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజ‌రు కానున్న 24 వేల మంది టీచ‌ర్లు
Advertisement

TG TET | త్రినేత్ర‌.న్యూస్ : ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ఉత్తీర్ణ‌త పొంద‌ని ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా టెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 8, 9 తేదీల్లో జ‌రిగే ఈ అర్హ‌త ప‌రీక్ష‌కు 24,986 మంది టీచ‌ర్లు హాజ‌రు కానున్నారు.

ప్ర‌భుత్వ ఉపాధ్యాయులంద‌రికీ టెట్ ఉత్తీర్ణ‌త తప్ప‌నిస‌రి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన‌ప్పుడు రాష్ట్రంలో 66 వేల మంది టీచ‌ర్ల దాకా టెట్ క్వాలిఫై కాలేదు. ఈ క్ర‌మంలో 2026 జ‌న‌వ‌రి, జూన్ నెల‌ల్లో నిర్వ‌హించిన టెట్ ప‌రీక్ష‌ల్లో 38 వేల మంది వ‌ర‌కు అర్హ‌త సాధించారు. ఇంకా 28 వేల మంది దాకా టెట్ ఉత్తీర్ణ‌త పొంద‌లేదు.

ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వ‌హించే టెట్‌కు 13 జిల్లాల్లో 41 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. టెట్ పేప‌ర్-1కు 5,964 మంది, పేప‌ర్‌-2కు 19,022 మంది హాజ‌రు కానున్నారు. మొత్తం 24,986 మంది టెట్ ప‌రీక్ష రాయ‌బోతున్నారు.

Advertisement
Advertisement