త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Staff | బ్యాంకు సిబ్బంది క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. న‌గ‌దుతో ఉడాయించిన వ్య‌క్తి

Bank Staff | నాగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోకి (SBI bank branch) ప్ర‌వేశించిన ఓ వ్య‌క్తి అక్క‌డి ఉద్యోగుల (Bank Staff) క‌ళ్ల‌లో కారం చ‌ల్లి భారీ మొత్తంలో న‌గ‌దు దోచుకెళ్లాడు.

D

National | Published On Sep 11, 2026, 4.27 pm IST

Bank Staff | బ్యాంకు సిబ్బంది క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. న‌గ‌దుతో ఉడాయించిన వ్య‌క్తి
Advertisement

Bank Staff | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్ (Nagpur)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోకి (SBI bank branch) ప్ర‌వేశించిన ఓ వ్య‌క్తి అక్క‌డి ఉద్యోగుల (Bank Staff) క‌ళ్ల‌లో కారం చ‌ల్లి భారీ మొత్తంలో న‌గ‌దు దోచుకెళ్లాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేవ‌లం 30 నిమిషాల్లోనే నిందితుడిని ప‌ట్టుకుని న‌గ‌దు రిక‌వ‌రీ చేశారు.

గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖానికి మాస్కుతో ఎర్ర కుర్తా, నల్ల పైజామా ధరించిన వ్య‌క్తి నాగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్యాంక్‌ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. ఆ స‌మ‌యంలో సిబ్బంది త‌మ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. గ‌మ‌నించిన నిందితుడు త‌న వెంట తెచ్చుకున్న సంచిలోని కారం పొడిని సిబ్బంది క‌ళ్ల‌లో చ‌ల్లాడు. అత‌డి చ‌ర్య‌తో బ్యాంకులో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. సిబ్బంది భ‌యంతో అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు. ఈ గందరగోళం మధ్య నిందితుడు.. కౌంటర్‌లోకి చొర‌బ‌డి అక్క‌డున్న రూ.4 లక్షల న‌గ‌దును తీసుకుని పారిపోయాడు.

కారం మంట నుంచి తేరుకున్న సిబ్బంది పోలీసుల‌ను సంప్ర‌దించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న స్థానిక పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలించారు. బృందాలుగా విడిపోయి గాలింపు చేప‌ట్టారు. కేవ‌లం 30 నిమిషాల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వ‌ద్ద నుంచి రూ.4 ల‌క్ష‌ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

Also Read..

బ‌ద్రీనాథ్‌లో విషాదం.. త‌ప్త్ కుండ్‌లో స్నాన‌మాచ‌రిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి

స్టాక్ మార్కెట్లకు చమురు షాక్‌.. 3 నెలల కనిష్ఠానికి నిఫ్టీ..

చరిత్రను మలుపు తిప్పిన 102 నిమిషాలు: 9/11 దాడులకు 25 ఏళ్లు.. మాస్టర్ మైండ్స్ అంతం ఎటు వైపు?

Advertisement
Advertisement