Mancherial | వేటగాళ్లను పట్టించిన ‘పొగాకు’.. ఆ వాసనను పసిగట్టిన స్నిఫర్ డాగ్
Mancherial | వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతూనే ఉంటారు. అయితే ఈ జంతువులను వేటాడేందుకు వీధి కుక్కలను సహాయంగా తీసుకున్నారు. అడవి జంతువులను వేటాడేందుకు ఆ వీధి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏ వీధి కుక్కలను అయితే వేటకు ఉపయోగించారో.. అదే జాతికి చెందిన స్నిఫర్ డాగ్ వారిని గుర్తించింది.
Mancherial | త్రినేత్ర.న్యూస్ : వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతూనే ఉంటారు. అయితే ఈ జంతువులను వేటాడేందుకు వీధి కుక్కలను సహాయంగా తీసుకున్నారు. అడవి జంతువులను వేటాడేందుకు ఆ వీధి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏ వీధి కుక్కలను అయితే వేటకు ఉపయోగించారో.. అదే జాతికి చెందిన స్నిఫర్ డాగ్ వారిని గుర్తించింది. అది కూడా వేటగాళ్లు వాడి వదిలేసిన పొగాకు ప్యాకెట్ ఆధారంగా.
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల పరిధిలోని అడవుల్లో జింకలు సంచరిస్తుంటాయి. అయితే ఆ జింకలను వేటాడేందుకు గట్రావుపల్లి గ్రామ పరిధిలోని ఇప్పలగూడకు చెందిన పెండ్రం విజయ్, సిదం పవన్, సెడ్మాకి లచ్చు వీధి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇక అడవుల్లోకి ఆ కుక్కలను తీసుకుని జింకలపైకి వదిలేసేవారు. దాంతో అవి జింకలను చంపేసేవి. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ క్రమంలో వారు నిఘా పెట్టారు. కానీ వేటగాళ్లు మాత్రం దొరకలేదు.
రంగంలోకి స్నిఫర్ డాగ్
జింకలను చంపేస్తున్న వేటగాళ్లను పట్టుకునేందుకు స్నిఫర్ డాగ్‌ను అటవీశాఖ అధికారులు రంగంలోకి దించారు. ఇక స్నిఫర్ డాగ్‌కు అటవీ ప్రాంతంలో పొగాకు ప్యాకెట్ కంటపడింది. ఆ వాసనను పసిగట్టిన స్నిఫర్ డాగ్.. దాని ఆధారంగా వేటగాళ్లను పట్టుకుంది. విజయ్, పవన్, లచ్చును అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు
- ●Jangaon | నష్కల్‌లో మద్యం విక్రయం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్
- ●Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ - రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో
- ●KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్
- ●Muharram Procession Poison | కనీసం 15 వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై పోలీసులకు చెప్పిన నిందితుడు
- ●Harish Rao | రేవంత్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?

CPI Narayana | పీవీ, మన్మోహన్ కృష్ణార్జునుల వలె పాలించారు

Jangaon | నష్కల్‌లో మద్యం విక్రయం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్

Telugu OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ - రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసిన హీరో

KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్



