Ravula Sridhar Reddy | స్కూల్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అని ఎట్లంటరు
Ravula Sridhar Reddy | ప్రభుత్వ విద్యకు, ప్రైవేట్ విద్యకు పోలిక అవసరం లేదని.. తండాలు, గూడేల్లో స్కూల్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అని సీఎం ఎలా అంటారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. రేషనలైజేషన్ అంటే తగ్గించడం కాదని సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు.
- విద్యపై సీఎం రేవంత్‌కు కనీస అవగాహన లేదు
- స్కూళ్లు తగ్గిస్తామని చెప్పేముందు కొంచెమైనా ఆలోచించారా?
- రేషనలైజేషన్ అంటే తగ్గించడం కాదని తెలుసుకో
- తుగ్లక్ నిర్ణయాలు బంజెయ్
- సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి ఫైర్
Ravula Sridhar Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ విద్యకు, ప్రైవేట్ విద్యకు పోలిక అవసరం లేదని.. తండాలు, గూడేల్లో స్కూల్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అని సీఎం ఎలా అంటారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గించే నిర్ణయంపై ఎవరితో చర్చలు జరిపారో సీఎం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ అంటే తగ్గించడం కాదని సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన బీఆర్ఎస్ నేత బద్రుద్దీన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై విమర్శులు గుప్పించారు.
విద్యాశాఖ నిర్వహణ అస్సలు బాలేదు..
విద్యా హక్కు చట్టం తెలిసే సీఎం మాట్లాడుతున్నారా? ఈ ప్రభుత్వంలో విద్యా శాఖ నిర్వహణ అధ్వానంగా మారింది. నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ విద్యా శాఖ ను తన దగ్గరే పెట్టుకొని ప్రకటనలు చేశారు. కానీ అమలు కావడం లేదు. ఒక కాంక్లేవ్ లో మాట్లాడుతూ 27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదిస్తామని సీఎం అన్నారు. ఈ ప్రకటన చేసే ముందు కొంచెమైనా ఆలోచించారా ? అని ఆయన నిలదీశారు.
విద్య గురించి సీఎంకు తెల్వదు..
ఒక వైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, పబ్లిక్ స్కూళ్లను కడతాను అని చెప్పుతూ.. మరో వైపు స్కూల్స్ తగ్గిస్తా అంటున్నారు. ప్రభుత్వవిద్యను గ్రామాల్లోని ప్రతి విద్యార్థికి అందేలా చేయాలి. ప్రైవేట్ విద్యను, కార్పొరేట్ విద్యను బలోపేతం చేసేందుకు సీఎం మాటలు ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రివి తుగ్లక్ నిర్ణయాలు. విద్యాహక్కు చట్టంపై, విద్యపై ఆయనకు అవగాహన లేదు అని రావుల ఎద్దేవా చేశారు.
చట్టంలో ఉన్నది అమలు చేయకుండా సొంతంగా ఎలా ఆలోచన చేస్తారు? విద్యార్థులకి బ్రేక్ ఫాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇంకా కాంగ్రెస్ అమలు చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలను మేం అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు మీరు పట్టించుకోవడం లేదు. విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారంటేనే ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని బీఆర్ఎస్ నేత రావుల పేర్కొన్నారు.
పాత పథకాలకు రేవంత్ పాతర..
ప్రభుత్వానికి ఫీజుల నియంత్రణ చేత కావడం లేదు. కేసీఆర్ హాయాంలో అమలైన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రేవంత్ దురుద్దేశంతో ఎత్తేసారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని పాత పథకాలకు రేవంత్ పాతర పెడుతున్నారు అని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
- ●Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
- ●Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
- ●ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు





