త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sarpanch | స‌ర్పంచ్‌ల‌కు గుడ్‌న్యూస్‌.. నేడు ఖాతాల్లోకి 6 నెల‌ల గౌర‌వ వేత‌నం..

Sarpanch | ఆరు నెల‌లుగా గౌర‌వ వేత‌నం కోసం ఎదురుచూస్తున్న‌ గ్రామపంచాయ‌తీ సర్పంచులకు (Sarpanch) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గౌరవ వేతనాల (Honorarium Salary) కోసం రెండు రోజుల క్రితం నిధులు విడుదల చేసింది.

G

Telangana | Published On Jun 11, 2026, 9.30 am IST

Sarpanch | స‌ర్పంచ్‌ల‌కు గుడ్‌న్యూస్‌.. నేడు ఖాతాల్లోకి 6 నెల‌ల గౌర‌వ వేత‌నం..
Advertisement

Sarpanch | త్రినేత్ర‌.న్యూస్‌: ఆరు నెల‌లుగా గౌర‌వ వేత‌నం కోసం ఎదురుచూస్తున్న‌ గ్రామపంచాయ‌తీ సర్పంచులకు (Sarpanch) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గౌరవ వేతనాల (Honorarium Salary) కోసం రెండు రోజుల క్రితం నిధులు విడుదల చేసింది. ఆ న‌గ‌దు గురువారం వారి ఖాతాల్లో జమ కానుంది.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు అదే నెల 20న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి మే వరకు 5 నెలల పెండింగ్ వేతనాలు ఒకేసారి అందనున్నాయి. ప్రస్తుతం సర్పంచులకు నెలకు రూ.6,500 గౌరవ వేతనం అందిస్తోంది ప్రభుత్వం. ఒక్కో సర్పంచుకు రూ.32,500 చొప్పున ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రంలో గ‌తేడాది డిసెంబర్‌ 22న 12,702 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించిన రూ.531 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

గౌరవ వేతనం బకాయి ఇలా..

  • రాష్ట్రంలో మొత్తం గ్రామాలు: 12,760
  • కొత్త సర్పంచ్‌లు ఉన్న గ్రామాలు : 12,702
  • ఒకో సర్పంచ్‌ నెలవారీ వేతనం : రూ. 6,500
  • ఆరు నెలల మొత్తం బకాయిలు : రూ. 39,000
  • ప్రభుత్వం ఇవ్వాల్సింది నెలవారీగా : రూ.8.25 కోట్లు
  • ఆరు నెలల బకాయి భారం: రూ.49,53,78,000

పాత సర్పంచ్‌లకూ బకాయిలు

పాత స‌ర్పంచుల‌కు గౌరవ వేతనం అందాల్సి ఉంది. గత పంచాయతీ పాలక వర్గాల్లో సర్పంచులుగా కొనసాగిన వారికి 18 నెలల వేతనం రావాల్సి ఉండగా ప్ర‌భుత్వం ఇంత వరకు చెల్లించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం స్తున్నారు. పదవీ కాలం పూర్తయి రెండేండ్లు పూర్త‌యినా ఇంకా తమకు రావాల్సిన గౌరవ వేతనం చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమకు బకాయి పడ్డ గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement