త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saleshwaram jathara | సలేశ్వరం జాతరలో విషాదం.. హోంగార్డ్ ఆత్మ‌హ‌త్య‌

Saleshwaram jathara | నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం జాతరలో హోంగార్డ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. జాత‌ర బందోబ‌స్తులో ఉన్న హోంగార్డ్ విషం సేవించి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

S

Telangana | Published On Apr 1, 2026, 5.55 pm IST

Saleshwaram jathara | సలేశ్వరం జాతరలో విషాదం.. హోంగార్డ్ ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Saleshwaram jathara | త్రినేత్ర‌.న్యూస్ : నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం జాతరలో హోంగార్డ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. జాత‌ర బందోబ‌స్తులో ఉన్న హోంగార్డ్ విషం సేవించి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

కొల్లాపూర్ మండ‌లం చెంచుగూడెంకు చెందిన బ‌య‌న్న‌(46) కోడేరు పోలీసు స్టేష‌న్‌లో హోంగార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే స‌లేశ్వ‌రం జాత‌ర నేప‌థ్యంలో బ‌య‌న్న‌కు అక్క‌డ డ్యూటీ వేశారు. విధుల్లో ఉండ‌గానే.. హోంగార్డు విషం తీసుకున్నాడు. అప్ర‌మ‌త్త‌మైన తోటి ఉద్యోగులు.. ఆయ‌న‌ను హుటాహుటిన అచ్చంపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ బ‌య‌న్న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో డెడ్‌బాడీని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మూడేండ్ల క్రితం బ‌య‌న్న భార్య కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement