బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సేవాలాల్ ఆలయం
Adluri Laxman Kumar | బంజారా సమాజ ఆత్మగౌరవం, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో ఈ నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
- ఈ నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
- మద్దిమడుగులో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- పెద్ద సంఖ్యలో తరలిరావాలని బంజారా సమాజానికి పిలుపు
Adluri Laxman Kumar | బంజారా సమాజ ఆత్మగౌరవం, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో ఈ నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా బంజారా సోదరులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సోమవారం మద్దిమడుగును సందర్శించిన మంత్రి.. ఆలయ ప్రాంగణం, సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అచ్చంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లనూ పరిశీలించారు.
భావితరాలకు వారసత్వ సంపద
సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక మార్గదర్శిగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. ఆయన బోధించిన ఐక్యత, సద్భావన, నైతిక విలువలు, సేవాభావం నేటికీ ఆచరణీయమన్నారు. మద్దిమడుగులో నిర్మించనున్న ఆలయం బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేసే ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ, విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు కూడా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
26న భారీగా తరలిరావాలి
సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని బంజారా సమాజ ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బంజారా సోదరులు, గిరిజన ప్రజాప్రతినిధులు, భక్తులు, సేవాలాల్ మహారాజ్ అనుచరులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మద్దిమడుగు ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతం కావాలని ప్రార్థించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే బాలు నాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు
- ●Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?
- ●Dhuandhar Waterfall | నర్మదా నది సృష్టించే ప్రకృతి అద్భుతం.. పొగమంచులా కనువిందు చేసే 'ధువాంధర్ వాటర్‌ఫాల్' విశేషాలివే!
- ●Thalapathy Vijay | అనిరుధ్, కావ్యమారన్ రిసెప్షన్లో సీఎం విజయ్ ధరించిన సూట్ ఖరీదు ఎన్ని లక్షలంటే?
- ●Godavari Pushkaralu 2027 | ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా గోదావరి పుష్కరాలు
- ●Adilabad | భూ వివాదం.. ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం

CM Revanth Reddy | 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతిచ్చారు

Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

Dhuandhar Waterfall | నర్మదా నది సృష్టించే ప్రకృతి అద్భుతం.. పొగమంచులా కనువిందు చేసే 'ధువాంధర్ వాటర్‌ఫాల్' విశేషాలివే!

Thalapathy Vijay | అనిరుధ్, కావ్యమారన్ రిసెప్షన్లో సీఎం విజయ్ ధరించిన సూట్ ఖరీదు ఎన్ని లక్షలంటే?





