CM Revanth Reddy | అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
CM Revanth Reddy | నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.379.07 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
CM Revanth Reddy | నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.379.07 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.274.32 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో బీటీ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.29.65 కోట్లతో శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలలో భాగంగా రూ.18.105 కోట్లతో 130 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు, నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.16 కోట్లు కేటాయించారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో రూ.14 కోట్లతో నూతన ఐటీడీఏ భవనాన్ని నిర్మించనున్నారు. అచ్చంపేట పట్టణంలో గిరిజనుల సౌకర్యార్థం రూ.2 కోట్లతో ఆదివాసీ భవన్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులతో నాగర్‌కర్నూల్ జిల్లాలో రహదారులు, విద్య, తాగునీరు, గిరిజన సంక్షేమ రంగాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కంటి మీద కునుకు లేదు.. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నా
- ●Telangana Bar Council | బార్ కౌన్సిల్లో 323 మంది పట్టభద్రుల రిజిస్ట్రేషన్.. ప్రమాణం చేయించిన కమిటీ
- ●CM Revanth Reddy | త్వరలోనే మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. సీఎం రేవంత్ ప్రకటన
- ●Rashmi Gautam | ఓటీటీలోకి యాంకర్ రష్మి ఆంథాలజీ సిరీస్ - రెండు భాషల్లో స్ట్రీమింగ్
- ●CM Revanth Reddy | కేసీఆర్.. జనంలోకి ఎప్పుడొస్తవ్
- ●Chandrababu Naidu | తెలంగాణలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికిన మంత్రి తుమ్మల

CM Revanth Reddy | కంటి మీద కునుకు లేదు.. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నా

Telangana Bar Council | బార్ కౌన్సిల్లో 323 మంది పట్టభద్రుల రిజిస్ట్రేషన్.. ప్రమాణం చేయించిన కమిటీ

CM Revanth Reddy | త్వరలోనే మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. సీఎం రేవంత్ ప్రకటన

Rashmi Gautam | ఓటీటీలోకి యాంకర్ రష్మి ఆంథాలజీ సిరీస్ - రెండు భాషల్లో స్ట్రీమింగ్





