త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెల‌వులు.. ఎప్పుడో తెలుసా..?

Sun Holidays | ఇది వానాకాలం.. కుండ‌పోత వ‌ర్షాలు కురియాలి.. కానీ ప‌రిస్థితి అలా లేదు. పోనీ మోస్త‌రు వ‌ర్షాలు కూడా లేవు. చివ‌ర‌కు చిరు జ‌ల్లులు కూడా దిక్కులేవు. న‌డి వానాకాలంలోనూ మండుటెండ‌లు దంచికొడుతున్నాయి.

S

Telangana | Published On Jul 17, 2026, 3.36 pm IST

Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెల‌వులు.. ఎప్పుడో తెలుసా..?
Advertisement

Sun Holidays | త్రినేత్ర‌.న్యూస్ : ఇది వానాకాలం.. కుండ‌పోత వ‌ర్షాలు కురియాలి.. కానీ ప‌రిస్థితి అలా లేదు. పోనీ మోస్త‌రు వ‌ర్షాలు కూడా లేవు. చివ‌ర‌కు చిరు జ‌ల్లులు కూడా దిక్కులేవు. న‌డి వానాకాలంలోనూ మండుటెండ‌లు దంచికొడుతున్నాయి. సూర్యుడు నిప్పులు క‌క్కుతున్నాడు. ఈ ఎండ‌ల వేడిమికి అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. కానీ ఈ వ‌ర్షాలు వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఏ మాత్రం ప‌నికిరావు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో నెటిజ‌న్లు గ‌త వానాకాలం సీజ‌న్లను గుర్తు చేసుకుంటున్నారు.

గ‌తేడాది వ‌ర‌కు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురిశాయ‌ని, కుండపోత వ‌ర్షాల‌తో తెలంగాణ త‌డిసి ముద్దైంద‌ని నెమ‌రేసుకుంటున్నారు. 2022 జూలై 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా ముసురు ప‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ 9 రోజుల పాటు సూర్యుడు క‌నిపిస్తే ఒట్టు. 9 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా భానుడి జాడ లేదు. మొత్తం క‌మ్ముకున్న మేఘాల‌తో.. రాష్ట్ర‌మంతా ముసురే.

2023లోనూ ముసురు ప‌ట్టిన ఘ‌ట‌న‌లు ఉన్నాయ‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. ఈ స‌మ‌యానికి రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యే వార‌ని పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడు రైతులు పొలాల్లో క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికీ పలుచోట్ల వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభం కాలేదు. ఆ వాన దేవుడి కోసం రైతాంగ లోకం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. కుండ‌పోత వ‌ర్షాలే కురియాల్సిన అవ‌స‌రం లేదు.. ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసినా వ్య‌వ‌సాయ ప‌నులను ప్రారంభించుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో అన్న‌దాత‌లు ఉన్నారు.

Advertisement
Advertisement