Heavy Rains | భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో పాఠశాలలకు సెలవు
Heavy Rains | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లాలో పాఠశాలలకు సెలవులు (Schools Holiday) ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లాలో పాఠశాలలకు సెలవులు (Schools Holiday) ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహాలు ఉన్న చోటకు వెళ్లకుండా ఉండాలన్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.
నిజామాబాద్ (Nizambad) జిల్లాలో రెండో రోజు వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల్లో వాడ పడుతున్నది. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తుంది. జిల్లాలోని కప్పలవాగు, ముత్యాలమ్మవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
పెద్దపల్లి జిల్లా రామగుండం (Ramagundam) పారిశ్రామిక ప్రాంతంలో గత రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో సింగరేణి (Singareni) సంస్థ నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లో భారీగా వరద చేరడంతో భారీ యంత్రాలు యార్డుకే పరిమితమయ్యాయి. ఇక హనుమకొండ జిల్లాలో బుధవారం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతుంది.
అత్యధికంగా వాజేడులో..
బుధవారం నుంచి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా వాజేడులో 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, ఏటూరునాగారంలో 15.2, సర్వాయిపేటలో 14.3, జైపూర్‌లో 14, బెజ్జూరులో 14, ధర్మవరంలో 13.8, కన్నాయిగూడెంలో 13, వెంకటాపురం 12.6, ముత్తారం, మహదేవ్‌పూర్‌లో 12.2, నస్పూర్‌లో 11.8, ఆసిఫాబాద్‌లో 11.3, సింగరేణి(రెబ్బన)లో 11.2, కాగజ్‌నగర్, మేడారంలో 10.6, సిర్పూర్(టి)లో 10.5, కౌతాలంలో 10.4, కాటారంలో 10.3, నెన్నెల 10.3 సెం.మీ. వర్షపాతం రికార్డయింది.
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితోపాటు వికారాబాద్ జిల్లాల్లోనూ అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు (Orange Alert) జారీ చేసింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేకపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్‌లో (Hyderabad) వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు హనుమకొండ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!






