త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drinking Water | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఈ ప్రాంతాల్లో 36 గంట‌ల పాటు మంచినీళ్లు బంద్‌

Drinking Water | హైద‌రాబాద్ (Hyderabad ) న‌గ‌ర‌వాసుల‌కు బిగ్ అల‌ర్ట్‌. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి 36 గంట‌ల పాటు మంచినీటి (Drinking Water) స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది.

G

Hyderabad | Published On Oct 4, 2026, 1.14 pm IST

Drinking Water | హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఈ ప్రాంతాల్లో 36 గంట‌ల పాటు మంచినీళ్లు బంద్‌
Advertisement

Drinking Water | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ (Hyderabad ) న‌గ‌ర‌వాసుల‌కు బిగ్ అల‌ర్ట్‌. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి 36 గంట‌ల పాటు మంచినీటి (Drinking Water) స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది. ఈ మేర‌కు జ‌ల‌మండ‌లి వెల్ల‌డించింది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్ల‌య్‌ ప్రాజెక్టు (KDWSP) ఫేజ్–II ప‌రిధిలో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనుండటంతో ఈ అంతరాయం కలగనుందని తెలిపింది. KDWSP ఫేజ్‌-2లో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి, అలాగే స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనుల‌ను అధికారులు చేపట్టనున్నారు.

ఈ ప‌నులు అక్టోబ‌ర్ 5 (సోమ‌వారం) ఉదయం 6 గంటల నుంచి అక్టోబ‌ర్ 6 (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు కొన‌సాగ‌నున్నాయి. దీంతో ఈ 36 గంటలు వ్య‌వ‌ధిలో ప‌లు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడ‌నుంది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవ‌డం లేదా పాక్షికంగా రావ‌డం, మరికొన్నిచోట్ల లో - ప్రెషర్‌తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్ర‌భావం ఉండేది ఈ ప్రాంతాల్లోనే..

  • ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ
  • బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి
  • బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్
  • నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం)
  • హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం)
  • పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ
  • నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ
  • బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్
  • సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్
  • మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ
  • బాలాపూర్, మైసారం
  • బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్
  • మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికంగా)

మ‌ర‌మ్మ‌త్తు పూర్త‌య్యే వ‌ర‌కు ఈ ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లుగుతుందని అధికారులు వెల్ల‌డించారు. అందువ‌ల్ల ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement