Nasha Mukt Yuva | చార్మినార్ వద్ద “నషా ముక్త్ యువ” వాక్‌థాన్
Nasha Mukt Yuva | యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్ (MY Bharat), తెలంగాణ, జాతీయ సేవా పథకం (NSS) సహకారంతో ఆదివారం “నషా ముక్త్ యువ” వాక్‌థాన్ నిర్వహించింది.
మై భారత్, తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహణ
Nasha Mukt Yuva | త్రినేత్ర న్యూస్ : యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మై భారత్ (MY Bharat), తెలంగాణ, జాతీయ సేవా పథకం (NSS) సహకారంతో ఆదివారం “నషా ముక్త్ యువ” వాక్‌థాన్ నిర్వహించింది.

హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ వద్ద ప్రారంభమైన ఈ వాక్‌థాన్ ప్రభుత్వ సిటీ కాలేజ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ చింతల మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు, అన్ని రకాల మత్తు పదార్థాల దుర్వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని, సానుకూల అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, నషా ముక్త్ భారత్ నిర్మాణంలో యువత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడంలో యువతలో అవగాహన, సమిష్టి చర్యల ప్రాధాన్యతను వివరించారు. యువత ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నషా ముక్త్ భారత్ నిర్మాణం యొక్క ప్రాధాన్యతను వివరించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా, కుటుంబాలు, సమాజం, దేశంపై కూడా విస్తృత ప్రభావాన్ని చూపుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మై భారత్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, ఎన్ఎస్ఎస్ నరసింహ, డీవైఎస్వో శ్రీనివాస్, ఆర్. శశాంక్, ఏపీఎస్ ఈ యాదగిరి, ఎం సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Diwali Bonus | రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 11.40 లక్షల మందికి ప్రయోజనం..!
- ●Indian Embassy Advisory | రియాద్‌కు విమాన సర్వీసులు బంద్.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ
- ●Honey Singh | హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ పోలీసుల సమన్లు
- ●PM Modi | మోదీని కలిసిన విదేశాంగ మంత్రి అనితా ఆనంద్.. భారత్–కెనడా బంధం బలోపేతానికి చర్చలు
- ●Kayadu Lohar | ‘డ్రాగన్’తో క్రేజ్.. ‘ది ప్యారడైజ్’తో నిరాశ.. తెలుగులో కయదుకు దక్కని బ్రేక్!
- ●Karthik Subbaraj | రజినీతో మిస్సయిన మ్యాజిక్.. చిరుతో చూపిస్తాడా..?

Diwali Bonus | రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 11.40 లక్షల మందికి ప్రయోజనం..!

Indian Embassy Advisory | రియాద్‌కు విమాన సర్వీసులు బంద్.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

Honey Singh | హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్ పోలీసుల సమన్లు

PM Modi | మోదీని కలిసిన విదేశాంగ మంత్రి అనితా ఆనంద్.. భారత్–కెనడా బంధం బలోపేతానికి చర్చలు






