త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | సీత‌క్క‌కు ఊర‌ట‌.. క్రిమిన‌ల్ కేసుల‌ను కొట్టేసిన హైకోర్టు

Seethakka | రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆమె దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌పై అనుకూల తీర్పు వెలువ‌డింది. దీంతో ప్రజా ప్రతినిధుల కోర్టులో ఆమెపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది.

S

Telangana | Published On Jul 21, 2026, 6.02 pm IST

Seethakka | సీత‌క్క‌కు ఊర‌ట‌.. క్రిమిన‌ల్ కేసుల‌ను కొట్టేసిన హైకోర్టు
Advertisement

Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆమె దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌పై అనుకూల తీర్పు వెలువ‌డింది. దీంతో ప్రజా ప్రతినిధుల కోర్టులో ఆమెపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది.

2020లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించిన సమయంలో, ఆసుపత్రుల భారీ బిల్లులు చెల్లించలేని పేద ప్రజల ప్రయోజనార్థం చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సీతక్క ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయితే, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు ధోరణితో ఆమెపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేసింది.

ఆ కేసులను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, సీతక్క తరఫున హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డి సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వాదనలను సమర్థిస్తూ ఆమెపై నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ మంగ‌ళ‌వారం తీర్పు వెలువరించింది.

Advertisement
Advertisement