త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Highcourt | ఉద్య‌మ‌కారుల‌కు ఇండ్ల‌ స్థ‌లాలు ఇవ్వాల్సిందే.. హైకోర్టు ఆదేశం

TG Highcourt | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహ‌ర్నిశ‌లు పోరాడిన‌ ఉద్య‌మకారుల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల్సిందేన‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీ, ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ శాఖ‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

S

Telangana | Published On Feb 23, 2026, 6.20 pm IST

TG Highcourt | ఉద్య‌మ‌కారుల‌కు ఇండ్ల‌ స్థ‌లాలు ఇవ్వాల్సిందే.. హైకోర్టు ఆదేశం
Advertisement

TG Highcourt | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహ‌ర్నిశ‌లు పోరాడిన‌ ఉద్య‌మకారుల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల్సిందేన‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీ, ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ శాఖ‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీ హామీల వ‌ర్షం గుప్పించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్య‌మ‌కారుల‌కు ఇండ్ల స్థలాలు ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే హామీని కాంగ్రెస్ పార్టీ నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో.. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఉద్య‌మ నాయ‌కులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్లు, ఉద్యమకారుల తరుపున హైకోర్టు న్యాయవాది జి కరుణాకర్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం అభయహస్తం స్కీం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు 8 వారాల్లో ఇండ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఫ్రీడమ్ ఫైటర్ శాఖకు హైకోర్టు న్యాయ‌మూర్తి విజ‌య‌సేన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement