త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEEVAN REDDY | సంజయ్ వైపే అధిష్టానం.. జీవన్ రెడ్డి గుర్రు

జగిత్యాల మున్సిపల్ ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం స్థానిక ఎమ్మెల్యే సంజ‌య్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. కొద్ది రోజులుగా టికెట్ల‌ విష‌యంలో సంజ‌య్‌, జీవ‌న్‌రెడ్డి నువ్వా నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతూ మ‌రోసారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ను త‌ల‌పించారు.

S

Telangana | Published On Feb 3, 2026, 2.36 pm IST

JEEVAN REDDY | సంజయ్ వైపే అధిష్టానం.. జీవన్ రెడ్డి గుర్రు
Advertisement

- జ‌గిత్యాల మున్సిప‌ల్ టికెట్ల కేటాయింపులో ర‌గ‌డ‌
- పంతం నెగ్గించుకున్న స్థానిక ఎమ్మెల్యే

త్రినేత్ర.న్యూస్‌: జగిత్యాల మున్సిపల్ ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం స్థానిక ఎమ్మెల్యే సంజ‌య్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. కొద్ది రోజులుగా టికెట్ల‌ విష‌యంలో సంజ‌య్‌, జీవ‌న్‌రెడ్డి నువ్వా నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతూ మ‌రోసారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ను త‌ల‌పించారు. జ‌గిత్యాల, రాయిక‌ల్ మున్సిపాలిటీల్లో 62 మంది అభ్య‌ర్థులను ఖ‌రారు చేయ‌గా సంజ‌య్ వ‌ర్గానికి 36, జీవ‌న్‌రెడ్డి వ‌ర్గానికి 26 సీట్లు కేటాయించింది. గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వాల‌న్న సీఎం రేవంత్‌రెడ్డి సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ నిర్ణ‌యం వెలువ‌రించిన‌ట్లు స‌మాచారం.

అయితే ఈ విష‌యంలో స్థానిక ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే దుమ్మెత్తిపోస్తున్నారు. జీవ‌న్‌రెడ్డి ఇంటికి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేరుకుంటుండ‌గా సంజ‌య్ నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. దీంతో అక్క‌డ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌న‌ను కాంగ్రెస్ మోసం చేసింద‌ని, నా వ‌ర్గమంటూ ఏదీ లేద‌ని, క్ర‌మశిక్ష‌ణ పేరుతో క‌ట్ట‌డి చేస్తే చూస్తూ ఉండ‌లేన‌ని జీవ‌న్‌రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే సంజ‌య్ త‌న పంతం నెగ్గించుకోవ‌డంతో ఆయ‌న అల‌క‌బూనారు.

Advertisement

తాజావార్తలు

Advertisement