ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
ITI Admissions | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ITI), అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లలో (ATCs) ఎన్‌సీవీటీ (NCVT)ల్లో ప్రవేశాల ప్రక్రియ (ITI Admissions) కొనసాగుతున్నది. మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూలై 10 వరకు పొడించారు.
ITI Admissions | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ITI), అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లలో (ATCs) ఎన్‌సీవీటీ (NCVT)ల్లో ప్రవేశాల ప్రక్రియ (ITI Admissions) కొనసాగుతున్నది. మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూలై 10 వరకు పొడించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 8న దరఖాస్తు గడువు ముగింసిపోయింది. అయితే విద్యార్థుల సౌకర్యం కోసం గడువును ప్రభుత్వం పొడిగింది. మరో ఆరు రోజుల్లో వ్యవధి ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), 63 ప్రభుత్వ ITIs, 230 ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: 8వ తరగతి లేదా 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులైనవారు సంబంధిత ట్రేడులను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2026, ఆగస్టు 1 నాటికి కనీసం 14 ఏండ్ల వయస్సు పూర్తయినవారై ఉండాలి. డ్రోన్ టెక్నీషియన్ (Drone Technician) ట్రేడ్ కోసం 16 ఏండ్లు వయస్సు నిండాలి. అదేవిధంగా క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) కింద ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి ఏదీ లేదు.
ఎంపిక విధానం..
అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆన్‌లైన్ ద్వారానే పరిశీలిస్తారు. అభ్యర్థికి పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులు, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీటు కేటాయిస్తారు. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా సమాచారం అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ. 100. అభ్యర్థులు ఒకే అప్లికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఎన్ని ఐటీఐలకైనా, ట్రేడులకైనా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
చివరితేదీ: జూలై 10
వెబ్‌సైట్: iti.telangana.gov.in
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- ●Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్
- ●Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
- ●Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..

Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్

Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు

Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి





