Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లలోనూ పెట్టుబడులు ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా భారీగా క్షీణించిన బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమవుతోంది.
Gold And Silver Prices Today | అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లలోనూ పెట్టుబడులు ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా భారీగా క్షీణించిన బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి పరుగులు పెడుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 1.26 శాతం మేర పెరిగి 4,174 డాలర్లకు చేరగా, వెండి ధర 2.30 శాతం మేర ఎగబాకి 62 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1620 పాయింట్లు లాభపడి 1,47,378 వద్ద నిలిచింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,106 పాయింట్లు పెరిగి 2,37,410 వద్ద స్థిరపడింది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం ధరలు మిశ్రమ స్పందనతో కొనసాగుతున్నాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,673 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17, 384 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,730 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,67,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,450 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,34,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,45,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,005 ఉండగా, 8 గ్రాముల ధర రూ.88,040గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,10,050 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,00,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
జులై 3, 2026

Gold And Silver Prices Today | బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.37వేలు పెరిగింది..
జులై 2, 2026

Gold And Silver Prices Today | అమెరికా డాలర్ ఎఫెక్ట్.. రోజు రోజుకీ భారీగా పడిపోతున్న బంగారం ధరలు..
జులై 1, 2026
తాజావార్తలు
- ●China | ఆ వాసన భరించలేకపోతున్నాం.. జిమ్‌లో ఓ వ్యక్తికి చేదు అనుభవం..!
- ●Eknath Shinde | ఏక్నాథ్ షిండేకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- ●Retirement Planning | రిటైర్మెంట్ ఆదాయానికి ఏది బెస్ట్? డివిడెండ్ షేర్లా.. ఎస్డబ్ల్యూపీలా?
- ●Badrinath Dham | బద్రీనాథ్ ధామ్‌లోనూ కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశం
- ●Basara Temple | బాలాలయంలో కొలువుదీరనున్న చదువుల తల్లి.. రేపటి నుంచి గర్భగుడిలో అమ్మవారి దర్శనాలు బంద్
- ●Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

China | ఆ వాసన భరించలేకపోతున్నాం.. జిమ్‌లో ఓ వ్యక్తికి చేదు అనుభవం..!

Eknath Shinde | ఏక్నాథ్ షిండేకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Retirement Planning | రిటైర్మెంట్ ఆదాయానికి ఏది బెస్ట్? డివిడెండ్ షేర్లా.. ఎస్డబ్ల్యూపీలా?

Badrinath Dham | బద్రీనాథ్ ధామ్‌లోనూ కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశం



