Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి
Jupally Krishna Rao | పర్యాటక, ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ (NITI Aayog) ప్రశంసించడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) హర్షం వ్యక్తం చేశారు.
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: పర్యాటక, ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ (NITI Aayog) ప్రశంసించడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల `అన్‌లాకింగ్ గ్రౌత్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్` (Unlocking Growth in Tourism and Hospitality Sector) అనే పేరుతో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో పర్యాటక రంగంలో తెలంగాణ (Telangana Tourism) అమలు చేస్తున్న విధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని సూచించడం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు లభించిన గుర్తింపేనని చెప్పారు.
హోటళ్ల నిర్మాణానికి సంబంధించి నిబంధనల సరళీకరణ, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, భూమి వినియోగంలో వెసులుబాటు, ఫ్లోర్ ఏరియా రేషియో (FAR) పెంపు, పార్కింగ్ నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో విధానం బలోపేతం వంటి చర్యలు తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ పర్యాటక విధానం–2025 - 2030 ఇప్పటికే విశేష ఫలితాలను ఇస్తున్నదని వెల్లడించారు. ఈ విధానం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమమైందని తెలిపారు.
గతంలో కూడా తెలంగాణ పర్యాటక రంగంలోని పలు ఉత్తమ కార్యక్రమాలు, పర్యాటక ప్రాంతాలకు నీతి ఆయోగ్ నివేదికల్లో స్థానం దక్కిందని గుర్తు చేశారు. తాజాగా మరోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణను ఆదర్శంగా పేర్కొనడం రాష్ట్ర పర్యాటక రంగం సరైన దిశలో ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన విధానాలు అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులు కల్పించి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- ●Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్
- ●ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
- ●Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
- ●Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..

Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్

ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు





