త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుద‌ల‌లో రేవంత్ ప్ర‌భుత్వం రికార్డు : మంత్రి తుమ్మ‌ల‌

Thummala Nageswara Rao | రైతుభరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం మరోసారి రికార్డు సాధించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 30న ప్రారంభమైన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.

P

Telangana | Published On Jul 3, 2026, 8.25 pm IST

Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుద‌ల‌లో రేవంత్ ప్ర‌భుత్వం రికార్డు : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Thummala Nageswara Rao | రైతుభరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం మరోసారి రికార్డు సాధించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 30న ప్రారంభమైన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నాలుగో విడతలో భాగంగా 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,188 కోట్లను నేరుగా జమ చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ విడతలో మొత్తం 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయం పొందారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి మూడు విడతల్లో 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందించగా, ఇప్పుడు ఆ పరిధిని విస్తరించి 4 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,402.37 కోట్ల సాయం ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం సాయం రూ.6,590.37 కోట్లకు చేరినట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement