Heavy Rains | నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..
Heavy Rains | రాష్ట్రంలో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది.
ఇక సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very Heavy Rains) కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరంజ్ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.

తాజావార్తలు
- ●Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- ●Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్
- ●ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
- ●Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..

Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్

ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు





