Adilabad | భూ వివాదం.. ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం
Adilabad | ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాద సమస్య పరిష్కారం కోసం ఓ రైతు అధికారులను ఆశ్రయించాడు. కానీ తన సమస్యకు పరిష్కారం లభించలేదు. చివరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
Adilabad | త్రినేత్ర న్యూస్ : ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాద సమస్య పరిష్కారం కోసం ఓ రైతు అధికారులను ఆశ్రయించాడు. కానీ తన సమస్యకు పరిష్కారం లభించలేదు. చివరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు దేవన్న సోమవారం తన భూ వివాద సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చాడు. తన సమస్యపై అధికారులకు వినతిని సమర్పించేందుకు వచ్చిన ఆయన, కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్నవారు, పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి దేవన్నను ఆటోలో రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో కలెక్టరేట్‌లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
తాజావార్తలు
- ●RBI | ఫ్లోటింగ్ రేట్ రుణగ్రస్తులకు గుడ్ న్యూస్.. ముందస్తు చెల్లింపులకు జరిమానా లేదు..
- ●Bullet train | మే నాటికి బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
- ●Dasoju Sravan Kumar | నాడు పోతిరెడ్డిపాడు.. నేడు పల్నాడు
- ●Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు
- ●Super El Niño | సూపర్ ఎల్నినో విధ్వంసం..!
- ●Jangaon Medical College | త్వరలోనే జనగాం మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం

RBI | ఫ్లోటింగ్ రేట్ రుణగ్రస్తులకు గుడ్ న్యూస్.. ముందస్తు చెల్లింపులకు జరిమానా లేదు..

Bullet train | మే నాటికి బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

Dasoju Sravan Kumar | నాడు పోతిరెడ్డిపాడు.. నేడు పల్నాడు

Doodimetla Balaraju Yadav | మీకు దక్కేది.. కోటి తిట్లు 9 సీట్లు





