Heavy Rain | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..
Heavy Rain | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు (Heavy Rain) దంచికొడుతున్నాయి. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rain | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు (Heavy Rain) దంచికొడుతున్నాయి. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగానూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని సూచించింది. కాగా, రానున్న 36 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో (North Telangana) రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయని, వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది.
ఇక హైదరాబాద్ నగరంలో గత సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం కూడా వాన పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గత 7 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగపూర్‌లో 140.8 మిల్లీమీటర్ల వర్షపాతం (Rainfall ) నమోదవగా, బుగ్గారంలో 138 మి.మీ., నిర్మల్‌లో 128.3 మి.మీ., నిర్మల్ జిల్లా కడమ్ పెద్దూర్‌లో 127.5 మి.మీ., జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 123 మి.మీ., నిర్మల్ జిల్లా మామ్డాలో 118 మి.మీ., జిగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 112.5, ఎండపల్లిలో 111.5 మి.మీ. వర్షపాతం నమోదయింది.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
హైదరాబాద్‌లో మరోసారి వాన దంచికొట్టింది. మియాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్ యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్‌పేట, దిల్‍సుఖ్‌నగర్, హయత్‌నగర్, నాచారం, కాప్రా తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రోడ్లపై అడుగు మేర నీరు ప్రవహించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్‌పేట్, కాచిగూడ, సికింద్రాబాద్, మెహిదీపట్నం, లంగర్ హౌస్,కార్వాన్, పాతబస్తీ చార్మినార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, రాంనగర్, కవాడీగూడ, జవహార్ నగర్, అంబర్‌పేట, కాచిగూడలోనూ వాన పడింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jubilee Hills CI | ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లోబర్చుకున్నాడు.. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
- ●UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోషల్ మీడియా ప్రాంక్..
- ●Horoscope | జూలై 29 రాశిఫలాలు.. మీ మాటలతో జాగ్రత్త.. లేకపోతే!
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

Jubilee Hills CI | ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లోబర్చుకున్నాడు.. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు

UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోషల్ మీడియా ప్రాంక్..

Horoscope | జూలై 29 రాశిఫలాలు.. మీ మాటలతో జాగ్రత్త.. లేకపోతే!

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం





