TG Weather | తెలంగాణపై మురాసు ప్రభావం.. మూడురోజులు అతిభారీ వర్షాలు..!
TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురాసు ప్రభావంతో తెలంగాణలో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురాసు ప్రభావంతో తెలంగాణలో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాన్ని ఆనుకొని ఒడిశాపై ఉన్న వాయుగుండం గడిచిన ఆరుగంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుగా ప్రయాణించిందని వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒంగోలు-నర్సాపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. అలాగే, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయిన తెలిపింది. అలాగే, వికారాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్
మంగళవారం నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. శుక్రవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు
- ●Rahul Gandhi Foreign Powers Allegation | రాహుల్ గాంధీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ.. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర
- ●Ponnam Prabhakar | పట్టభద్రుల ఓటర్ల నమోదు గడువు పెంచండి.. ఎన్నికల సంఘానికి పొన్నం విజ్ఞప్తి
- ●Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1.68 శాతం పెరిగిన నిఫ్టీ..
- ●Nora Fatehi | కోర్టు అంటే తమాషా అనుకున్నావా - నోరా ఫతేహికి ఝలక్
- ●Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధరాత్రి ఏపీలో తీరం దాటనున్న తుపాను

Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు

Rahul Gandhi Foreign Powers Allegation | రాహుల్ గాంధీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ.. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర

Ponnam Prabhakar | పట్టభద్రుల ఓటర్ల నమోదు గడువు పెంచండి.. ఎన్నికల సంఘానికి పొన్నం విజ్ఞప్తి

Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1.68 శాతం పెరిగిన నిఫ్టీ..





