త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rainfall | నేటి నుంచి ఈ నెల 8 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు.. త‌గ్గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు

Heavy Rainfall | దేశంలోకి రుతుప‌వ‌నాలు (Monsoon) ప్ర‌వేశించాయి. గురువారం కేర‌ళ తీరాన్ని తాకాయి. అన్నీ అనుకూలిస్తే మ‌రో నాలుగైదు రోజుల్లో తెలంగాణ‌లోకి (Telangana) ప్ర‌వేశించ‌నున్నాయి. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి ఈ నెల 8 వ‌ర‌కు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు (Heavy Rainfall) కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) వెల్ల‌డించింది.

G

Telangana | Published On Jun 5, 2026, 6.53 am IST

Heavy Rainfall | నేటి నుంచి ఈ నెల 8 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు.. త‌గ్గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు
Advertisement

Heavy Rainfall | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోకి రుతుప‌వ‌నాలు (Monsoon) ప్ర‌వేశించాయి. గురువారం కేర‌ళ తీరాన్ని తాకాయి. అన్నీ అనుకూలిస్తే మ‌రో నాలుగైదు రోజుల్లో తెలంగాణ‌లోకి (Telangana) ప్ర‌వేశించ‌నున్నాయి. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి ఈ నెల 8 వ‌ర‌కు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు (Heavy Rainfall) కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) వెల్ల‌డించింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

అదేవిధంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని చెప్పింది. ఈ నేప‌థ్యంలో రానున్న నాలుగు రోజుల్లో గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 2 నుంచి 5 డిగ్రీల వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఎండ తీవ్రత గణనీయంగా తగ్గనుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం మ‌ధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. న‌ల్ల‌గొండ‌, జ‌న‌గామ‌, కామారెడ్డి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. హైద‌రాబాద్‌లో కూడా అక్క‌డ‌క్క‌డ జ‌ల్లులు కురిశాయి.

Advertisement
Advertisement