త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain | రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు..

Heavy Rain | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీవర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్ల‌డించింది.

G

Telangana | Published On Jun 15, 2026, 8.33 am IST

Heavy Rain | రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు..
Advertisement

Heavy Rain | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీవర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్ల‌డించింది. జూన్ 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉండగా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు పసుపు రంగు (5 సెంటి మీటర్ల వరకు) హెచ్చరికలు జారీ చేసింది.

సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గామ‌, సిద్దిపేట‌, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.

మంగ‌ళ‌వారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ‌ల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వ‌ర్షం కురుస్తుంద‌ని పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలో 3.2, నల్ల‌గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్లలో 3 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయింది.

Advertisement
Advertisement