త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Waves | ఉత్త‌ర తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు.. వ‌డ‌గాల్పుల‌తో జ‌నం ఉక్కిరిబిక్కిరి

G

Telangana | Published On May 4, 2026, 6.31 am IST

Heat Waves | ఉత్త‌ర తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు.. వ‌డ‌గాల్పుల‌తో జ‌నం ఉక్కిరిబిక్కిరి
Advertisement

Heat Waves | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్త‌ర తెలంగాణ‌పై (Telangana) సూర్యూడు ప‌గ‌బ‌ట్టిన‌ట్లున్నాడు.. ఓ వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు, మ‌రో వైపు వ‌డ‌గాల్పుల‌తో (Heat Waves) జ‌నం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యుడి ప్ర‌కోపానికి ఉత్త‌ర తెలంగాణ జిల్లాలు మాడిపోతున్నాయి. ఎండ వేడిమికి ప్ర‌జ‌లు ఠారెత్తిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మెండోర‌లో అత్య‌ధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. బాల్కొండ‌లో 45.8, జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్ 45.7, పెద్ద‌ప‌ల్లి జిల్లా పాల‌కుర్తిలో 45.4, ఆదిలాబాద్ జిల్లా బేల 45.3, ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 45.2, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1 డిగ్రీలు ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఇక మొద‌క్ 43.5, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 43., హైద‌రాబాద్ 41.6, న‌ల్ల‌గొండ 41.5, ఖ‌మ్మం 41.2 డిగ్రీలు న‌మోద‌య్యాయి.

అధిక ఉష్ణోగ్ర‌తకు వ‌డ‌గాల్పులు తోడ‌య్యాయి. దీంతో ఉత్త‌ర తెలంగాన‌లోని 9 జిల్లాల్లో ఉన్న 32 మండ‌లాలు ఉడికిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల‌, భోర‌జ్‌, బేల‌, ఆదిలాబాద్ అర్బ‌న్‌, జైన‌ద్‌, నిమాబాద్ జిల్లా మెండోరా, మోస్రా, ముక్ప‌ల్‌, ఆలూరు, పోతంగ‌ల్ మండ‌లాల్లో వ‌డ‌గాల్పులు వీచాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని 5 మండ‌లాలు, జ‌గిత్యాల‌లో 4, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 3, పెద్ద‌ప‌ల్లిలో 3, రంగారెడ్డిలో 3, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో 2 మండ‌లాల్లో వ‌డ‌గాలులు వీచాయి.

మ‌రోవైపు రానున్న రెండు రోజులు కూడా వాతావ‌రణం ఇదే విధంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయిని చెప్పింది. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.

 

Advertisement
Advertisement