త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | నిప్పుల కుంప‌టిని త‌ల‌పిస్తున్న ఎండ‌లు.. విల‌విల‌లాడిపోతున్న‌ ప్ర‌జ‌లు

Heat Wave | తెలంగాణ‌లో భానుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. ఎండ‌లు నిప్పుల కుంప‌టిని త‌ల‌పిస్తున్నాయి. మండుటెండ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు.

S

Telangana | Published On May 22, 2026, 6.12 am IST

Heat Wave | నిప్పుల కుంప‌టిని త‌ల‌పిస్తున్న ఎండ‌లు.. విల‌విల‌లాడిపోతున్న‌ ప్ర‌జ‌లు
Advertisement

Heat Wave | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో భానుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. ఎండ‌లు నిప్పుల కుంప‌టిని త‌ల‌పిస్తున్నాయి. మండుటెండ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతున్న క్ర‌మంలో వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి పూట కూడా ఉక్క‌పోత తీవ్రంగా ఉంటుంది. మొత్తంగా ప‌గ‌టి, రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు జ‌నాల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి.

గురువారం తెలంగాణ‌లో అత్య‌ధికంగా పెద్ద‌ప‌ల్లి జిల్లా ముత్తారంలో, సూర్యాపేట జిల్లాలో 46.5 డిగ్రీల చొప్పున‌ ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంచుపల్లిలో 46.4 డిగ్రీలు, మహబూబాబాద్‌ జిల్లా కురవిలో 46.3, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 46.2, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్‌లో 46.1, కామారెడ్డి 45.9, జనగామ 45.5, మెదక్‌ 45.1, నాగర్‌కర్నూలు 44.9, రంగారెడ్డి 44.9, సంగారెడ్డి 44.1, మేడ్చల్‌ 43.9, మహబూబ్‌నగర్‌ 43.6, హైదరాబాద్‌ 43.4, గద్వాల 43.3, వికారాబాద్‌ 43.1, వనపర్తి 42.8, నారాయణపేట జిల్లాలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement