Head Constable | విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతి
Head Constable | విధి నిర్వహణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మెదక్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్టీలో విధులు నిర్వహిస్తున్న ఆనందం మంగళవారం చెక్‌పోస్ట్ విధుల నిమిత్తం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకోగానే ఛాతినొప్పి రావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
తూప్రాన్‌లో ఛాతినొప్పితో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్
మేడ్చల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Head Constable | త్రినేత్ర.న్యూస్ : విధి నిర్వహణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మెదక్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్టీలో విధులు నిర్వహిస్తున్న ఆనందం మంగళవారం చెక్‌పోస్ట్ విధుల నిమిత్తం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకోగానే ఛాతినొప్పి రావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
ఆస్పత్రిలో వైద్యులు ఈసీజీ నిర్వహిస్తున్న సమయంలో ఆనందం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది సీపీఆర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆనందం మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది తెలిపారు. విధుల్లో చురుగ్గా ఉండటంతో పాటు సహచరులకు అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆనందం ఇక లేరనే వార్త తెలియడంతో సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
హెడ్ కానిస్టేబుల్ ఆనందం మృతిపట్ల జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఆనందం అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనందం అంత్యక్రియలను బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






