త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CRPF | సీఆర్‌పీఎఫ్‌లో 521 హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్ పోస్టులు..

CRPF | కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటాలో (Sports Quota) హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 521 ఖాళీల‌కు మెరిట్ కలిగిన పురుషులు, మహిళా క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Sep 23, 2026, 9.25 am IST

CRPF | సీఆర్‌పీఎఫ్‌లో 521 హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్ పోస్టులు..
Advertisement

CRPF | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటాలో (Sports Quota) హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 521 ఖాళీల‌కు మెరిట్ కలిగిన పురుషులు, మహిళా క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న‌ది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టును బ‌ట్టి రూ.21,700 నుంచి రూ.81,100 వ‌ర‌కు ప్ర‌తినెల జీతం చెల్లిస్తారు.

మొత్తం పోస్టులు: 521
హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): 182 పోస్టులు (పురుషులు 150, మహిళలు 32)
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ): 339 పోస్టులు (పురుషులు 258, మహిళలు 81)

అర్హత: హెడ్ కానిస్టేబుల్ (GD) పోస్టుల‌కు 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లేదా నేషనల్ గేమ్స్, చాంపియన్‌షిప్‌లు, ఇంటర్-యూనివర్సిటీ టోర్నమెంట్‌లలో 1 నుంచి 3వ స్థానం సాధించాలి.

కానిస్టేబుల్ (GD) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో రాష్ట్ర‌, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. లేదా ఖేలో ఇండియా, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనాలి. 2026, ఆగ‌స్టు 1 నాటికి 18 నుంచి 23 ఏండ్ల‌ మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 2023, ఆగ‌స్టు 2 కంటే ముందు, 2008, ఆగ‌స్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్‌, క్రీడా సర్టిఫికెట్లలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారీ, వైద్య పరీక్షలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన తదితరాల ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్విస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభం: 2026 అక్టోంబ‌ర్ 12
దరఖాస్తుల‌కు చివరి తేదీ: 2026 న‌వంబ‌ర్ 11
వెబ్‌సైట్‌: rect.crpf.gov.in

మ‌రిన్ని వివ‌రాల‌కు..

Advertisement
Advertisement