Kalwakuntla Kavitha | అసెంబ్లీని అడ్వర్టైజ్‌మెంట్ కోసం వాడుకుంటున్నడు
Kalwakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే బ్లాక్ మెయిలింగ్, దందాలు, కబ్జాలు, బెదిరింపులు గుర్తుకొస్తాయని.. అలాంటి వ్యక్తి నిండు అసెంబ్లీలో తనకు కమీషన్లు ఎందుకని సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ అసెంబ్లీని అడ్వర్టైజ్‌మెంట్ కోసం వాడుకుంటున్నాడని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
- బ్లాక్‌మెయిలర్ల సంఘమంటూ ఒకటుంటే దానికి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండాల్సిందే
- హరీశ్ రావు తన తండ్రి పేరు మీద సిద్దిపేటలో 100 ఎకరాలు బదలాయించుకున్నడు
- రేవంత్‌కు దమ్ముంటే బయటికి తీయాలి
- 20న కొడంగల్ వస్తున్నం.. రేవంత్ పాపాల చిట్టా బయటపెడతం
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
Kalwakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే బ్లాక్ మెయిలింగ్, దందాలు, కబ్జాలు, బెదిరింపులు గుర్తుకొస్తాయని.. అలాంటి వ్యక్తి నిండు అసెంబ్లీలో తనకు కమీషన్లు ఎందుకని సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ అసెంబ్లీని అడ్వర్టైజ్‌మెంట్ కోసం వాడుకుంటున్నాడని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సమాచార హక్కు చట్టాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని వేల కోట్ల రూపాయలు పోగేశారని ఆరోపించారు. సిద్దిపేటలో హరీశ్ రావు తన తండ్రి పేరు మీద బదలాయించుకున్న 100 ఎకరాల భూమిని బయటకు తీయాలన్నారు. బీఆర్ఎస్‌వాళ్లు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. ఈనెల 20 కొడంగల్‌కు వచ్చి సీఎం పాపాల చిట్టాను విప్పబోతున్నామని వ్యాఖ్యానించారు. ఈమేరకు శనివారం ఆమె ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. రేవంత్, పొంగులేటి, హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చిస్తారనుకుంటే అసెంబ్లీ బయట అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బాహాబాహీకి పోవడం, ఒకరినొకరు వింత వింతగా తిట్టుకోవడం.. ఈ అంతా తతంగంలో స్పీకర్‌ను నానా రకాలుగా దుర్భాషలాడడం ఇవన్నీ పరిణామాలు గమనిస్తున్నం. ఒక మాజీ ఎంపీ, ఎమ్మెల్సీగా చాలా బాధైతుంది. చట్టసభల్లో ఒక 10 నిమిషాలు ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి పని చేస్తే లక్షలాది మంది జీవితాలు మారిన సందర్భాలు ఈ దేశ చరిత్రలో ఉన్నయ్.
కానీ అవన్నీ పక్కన పెట్టారు. ప్రజా ధనాన్ని వ్యర్థం చేస్తున్నమనే ఇంగితం లేకుండా ఒక పక్క బీఆర్ఎస్, మరోపక్క కాంగ్రెస్ ప్రజలతో ఆటలాడుకున్న విషయాన్ని గమనించాలి. బీజేపీ ఇంకో విచిత్రమైన పాత్ర పోషిస్తుంది. అందులో సగం మంది కాంగ్రెస్ పక్షాన, సగం మంది బీఆర్ఎస్ పక్షాన ఉన్నరు. అల్టీమేట్‌గా ఏ ఒక్కరూ ప్రజల సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు.
వీటన్నిటికీ తోడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కమలాహాసన్‌లాగా, స్వాతిముత్యంలాగా అసెంబ్లీలో లేచి ఏకపాత్రాభినయం చేశాడు. కంప్లీట్‌గా అడ్వర్టైజింగ్ కోసం వాడుకుంటున్నడు. తెలంగాణ ఉద్యమంతో సబంధంలేని ముఖ్యమంత్రి దేవుడు నాకు అన్ని ఇచ్చిండని చెప్తుండు. అవును.. దోచుకొని తినడానికి ఒక మిత్రమండలినే ఇచ్చిర్రు. భయంకరమైన ఫ్యామిలీని ఇచ్చిండు. అవినీతి ఎలా చేయాలో రాటుదేలిన ఒక బృందాన్ని భగవంతుడు మీకు ఇచ్చిండు. రాష్ట్రంలో బ్లాక్‌మెయిలర్ల సంఘం అంటూ ఒకటి ఉంటే దానికి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండాల్సిందే.
అవినీతి సామ్రాట్‌గా ఉన్నరు..
22ఏ తోని పొంగులేటి వసూలు చేసుకొనొచ్చి మీకు ఇయ్యాలి. ఇరిగేషన్‌తోని వసూలు చేసుకొచ్చి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీకు ఇయ్యాలి. ఇసుకనేమో సీతక్కకు రాసిచ్చిర్రు. ఒక్కొక్క శాఖను ఒక్కొక్కరికి రాసిచ్చి అవినీతి సామ్రాట్‌గా మీరున్నరు తప్పితే.. మామూలుగా లేరు. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు నాకేందుకు కమీషన్లు అని మాట్లాడుతున్నరు.
అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తరా?
అయ్యా రేవంత్‌రెడ్డి గారు.. ఆంధ్రావాళ్ల పక్కన చేరి తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించాలని డైరెక్ట్‌గా క్యాష్ డీలింగ్ చేస్తూ దొరికిపోయిన మీ సంగతి ప్రజలకు గుర్తులేదా.. నేనేదో సాంప్రదాయనీ, సుద్దిని, సుప్పిని అన్నట్లు మీరు మాట్లాడుతుంటే సూసేటోళ్లంతా నవ్వుకుంటున్నరు. ఘోరం ఏందంటే అట్లా మాట్లాడుతుంటే అడ్డుకోవడానికి ప్రతిపక్షం లేదండి. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్లను సస్పెండ్ చేసిర్రు.. పోని మొన్న కౌన్సిల్ ఎందుకు వాకౌట్ చేసిర్రు. ప్రజా సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోయిండ్రు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నరు. ప్రజలు ఓటేసింది ఎందుకని మీకు గుర్తు లేదా? అంటే అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తరా? లేకుంటే రారా? దీన్ని బీఆర్ఎస్ వాళ్లు సమీక్షించుకోవాలని డిమాండ్ చేస్తున్నం.
రేవంత్ చెప్పిన విషయాలు, చేతలకు పొంతన లేదు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా అట్టర్‌ఫ్లాప్ అయ్యిండ్రు. హోంశాఖ మంత్రిగా మహిళలకు రక్షణ లేని పరిస్థితిని కల్పించిండ్రు. అవినీతిలో అవసరమైతే బీజేపీతోని, బీఆర్ఎస్‌తోని పొత్తు. గుంపు మేస్త్రీ, గుంటనక్క ఇద్దరు కలిసి ఒకరినొకరు కాపాడే పరిస్థితి ఉన్నది.
రేవంత్, పొంగులేటికి ఇదే నా ఛాలెంజ్..
ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 22ఏ కింద సిద్దిపేట పట్టణంలో 100 ఎకరాలు హరీశ్ రావు తండ్రి పేరు మీద బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి బదలాయించుకున్నరు. రేవంత్, పొంగులేటికి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. మీకు దమ్ముంటే, గుంపుమేస్త్రీ, గుంటనక్కకు ఎటువంటి అండర్‌స్టాండింగ్ లేకపోతే తీసి బయట పెట్టండి. కాంగ్రెస్ ఎన్ని అక్రమాలు చేస్తుందో అంతకంటే ఎక్కువ అక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో జరిగినయ్. నా దగ్గర సాక్ష్యాదారాలు ఉన్నయ్. ప్రభుత్వానికి పంపిస్తున్నా. దమ్ముంటే చర్చ పెట్టి చర్యలు తీసుకోవాలి.
నీ గడ్డ మీద నిలబడి చెప్తా..
అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అవినీతి కింగ్‌గా మీరున్నరు. మీ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. మీ పాపాల చిట్టా విప్పడానికే ఈనెల 20న మేం కొడంగల్‌కు వస్తున్నం. మా పాంచజన్య సంకల్ప సభ పెడుతున్నం. మీ అవినీతిని మీ గడ్డ మీద నిలవడి చెప్పబోతున్నం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?
- ●New Delhi Declaration | భారత్ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాల ఏకగ్రీవ ఆమోదం
- ●Telangana | తెలంగాణ భాష కేవలం ఒక్క భాష మాత్రమే కాదు.. ప్రజల జీవన విధానం కూడా
- ●Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..
- ●GV Prasad | నారాయణపేట డీఎఫ్‌వో అరుదైన ఘనత
- ●TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌కు ‘CURE’ మందా.. సామాన్యుడి జేబుకు చిల్లా?

New Delhi Declaration | భారత్ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు బ్రిక్స్ దేశాల ఏకగ్రీవ ఆమోదం

Telangana | తెలంగాణ భాష కేవలం ఒక్క భాష మాత్రమే కాదు.. ప్రజల జీవన విధానం కూడా

Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..




