Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తా అంటున్నడు.. ప్రజల భూమి ప్రజలకివ్వడానికి రేవంత్ ఎవరు?
Talasani Srinivas Yadav | 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తానని సీఎం రేవంత్ అంటున్నారని.. ప్రజల భూమి ప్రజలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. 22ఎ ద్వారా 30 నుంచి 40 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్న భూములను 22ఎ లో పెట్టడానికి సీఎం రేవంత్‌కు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.
- ఎన్ని డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టామో వస్తే చూపిస్తం.. ఆల్రెడీ భట్టి విక్రమార్కకు చూపించా
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: 22ఎ కింద మీ భూమి మీకే ఇప్పిస్తానని సీఎం రేవంత్ అంటున్నారని.. ప్రజల భూమి ప్రజలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. 22ఎ ద్వారా 30 నుంచి 40 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్న భూములను 22ఎ లో పెట్టడానికి సీఎం రేవంత్‌కు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. పేద, మధ్య తరగతి కుటుంబాల భూములు, ఇళ్లను 22ఎ లో పెట్టారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ కట్టామో రేవంత్ వస్తే చూపిస్తామన్నారు. తెలంగాణ భవన్ నేడు జనతా గ్యారేజ్‌లా మారిందని చెప్పారు. ఈమేరకు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నిన్న కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరంలో 69 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ ఈ విధంగా లేవని నాటి గవర్నర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మెచ్చుకున్నారు. కొల్లూరులో ఒక్క చోటే 16 వేల ఇళ్లు కట్టాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నేను డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించాను. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ యూనిట్ కాస్ట్ 9.50 లక్షలు. ఇందిరమ్మ ఇళ్లకు 6 లక్షలు కట్టాలని ప్రభుత్వం అంటోంది. అప్లికేషన్ కు 10 వేల రూపాయలు ఇవ్వాలని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ అప్లికేషన్ కు 10 వేల రూపాయలు వసూలు చేసి ఇళ్లు ఇవ్వలేదు.
దేవుళ్లను పూజించడం మన సంప్రదాయం. సీఎం రేవంత్ రెడ్డి చేతబడులు, క్షుద్ర పూజల గురించి మాట్లాడవచ్చా? కొంతమంది అమాయకంగా మాట్లాడారని పట్టించుకోలేదు. కానీ ఏకంగా సీఎం క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అడ్డంగా మాట్లాడుతున్నారు. మీ మునుగోడు ఎమ్మెల్యే ఏం మాట్లాడారో చూసుకో రేవంత్ రెడ్డి. క్షుద్ర పూజలపై రేవంత్ రెడ్డి మాటలు వింటే ఆశ్చర్యం వేస్తోంది అని తలసాని విమర్శించారు.
సంబంధిత వార్తలు

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం
ఆగస్టు 14, 2026

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
ఆగస్టు 14, 2026

Malla Reddy | 22A యాడికెళ్లొచ్చింది? ఎవల్దెచ్చిర్రు.. మీరు ఇమ్మిడియేట్లి దిగి బొంరాస్‌పేట రైతుల భూములు కాపాడాలే
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం
- ●KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
- ●HDFC Mid Cap Fund | రూ.10 లక్షలను రూ.1కోటిగా మార్చిన ఫండ్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
- ●Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే
- ●Telangana Cabinet | ఆటో డ్రైవర్లకు కొత్త పథకం.. సబ్సిడీ రూ. లక్షా 50 వేలు
- ●Prabhas | ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్రభాస్ - ఇన్నాళ్లు బాహుబలి ... ఇకపై ఫౌజీ

BRS Party | టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను రద్దు చేయండి.. లోకాయుక్తకు బీఆర్ఎస్ విన్నపం

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి

HDFC Mid Cap Fund | రూ.10 లక్షలను రూ.1కోటిగా మార్చిన ఫండ్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..

Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే



