త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HCU | హెచ్‌సీయూలో టీచింగ్ ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు.. న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

HCU | హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం (HCU) ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 37 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు (University of Hyderabad) ఆహ్వానిస్తున్న‌ది.

G

Telangana | Published On Nov 9, 2026, 7.14 am IST

HCU | హెచ్‌సీయూలో టీచింగ్ ఫ్యాక‌ల్టీ ఉద్యోగాలు.. న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు
Advertisement

HCU | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం (HCU) ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 37 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు (University of Hyderabad) ఆహ్వానిస్తున్న‌ది. ఈ పోస్టులు సైన్సెస్, హ్యూమనిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు CU-Chayan అధికారిక పోర్టల్ ద్వారా నవంబర్ 16వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్లతో కూడిన హార్డ్ కాపీని నవంబర్ 20లోగా విశ్వవిద్యాలయానికి పంపించాలి. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల‌ ప్రొఫెసర్ పోస్టుల‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400 వ‌రకు జీతం వ‌స్తుంది.

మొత్తం ఖాళీలు- 37

ప్రొఫెసర్- 12
అసోసియేట్ ప్రొఫెసర్- 16
అసిస్టెంట్ ప్రొఫెసర్- 9

అర్హతలు: పోస్టును బట్టి అభ్యర్థులకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం అవసరం.

ప్రొఫెసర్ పోస్టులు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు మంచి పరిశోధనా రికార్డు, కనీసం 10 సంవత్సరాల బోధన లేదా సంబంధిత పరిశోధన అనుభవం, నిర్దేశిత పరిశోధనా ప్రచురణలు అవసరం. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రత్యామ్నాయ అర్హతల ప్రకారం అత్యుత్తమ వృత్తిపరమైన అనుభవం ఉన్నవారు కూడా అర్హత పొందవచ్చు.

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, కనీసం 8 సంవత్సరాల బోధన లేదా పరిశోధన అనుభవం ఉండాలి. నిర్దేశిత పరిశోధనా ప్రచురణలు, పరిశోధనా స్కోరు కూడా అవసరం.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. యూజీసీ నెట్‌, సీఎస్ఐఆర్ నెట్‌, ఎస్ఎల్ఈటీ, సెట్ ఉత్తీర్ణత ఉండాలి. యూజీసీ నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు కలిగిన పీహెచ్‌డీ అభ్యర్థులకు మినహాయింపులు వర్తించవచ్చు.

ఎంపిక విధానం: అభ్యర్థుల విద్యార్హతలు, గత అకడమిక్ రికార్డు, పరిశోధనా ప్రచురణలు, అనుభవం తదితర అంశాలను పరిశీలిస్తారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూతో పాటు సెమినార్, కొలోక్వియం, డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ లేదా ఇతర విధానాలను కూడా యూనివర్సిటీ ఉపయోగించవచ్చు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ + హార్డ్ కాపీ. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీసుకుని అవసరమైన అన్ని సర్టిఫికెట్ల స్వీయ ధ్రువీకరించిన (Self-attested) కాపీలను జతచేయాలి. దరఖాస్తును పోస్టు లేదా కొరియర్ ద్వారా నిర్ణీత చిరునామాకు పంపించాలి. వ్యక్తిగతంగా వెళ్లి హార్డ్ కాపీ సమర్పించడానికి అనుమతి లేదు.

అడ్ర‌స్‌..
The Assistant Registrar,
Recruitment Cell, Room No. 221, First Floor,
Administration Building,
University of Hyderabad,
Prof. C.R. Rao Road, Central University P.O.,
Gachibowli, Hyderabad – 500046,
Telangana, India.

అప్లికేష‌న్‌ ఫీజు: రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ: న‌వంబ‌ర్ 16
హార్డ్ కాపీ చివరి తేదీ: న‌వంబ‌ర్ 20
వెబ్‌సైట్: uohyd.ac.in

Advertisement
Advertisement