Chanagani Dayakar | సిగ్గు తెచ్చుకొని మాట్లాడు కేటీఆర్.. పిచ్చి మాటలు మాట్లాడితే బయట తిరగలేవ్
Chanagani Dayakar | కేటీఆర్ సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటదని.. పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ హెచ్చరించారు. పదేండ్లు కేటీఆర్ భోగాలు తప్ప తెలంగాణ యువత బాధలు పట్టించుకోలేదని విమర్శించారు. పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు.
- నిరుద్యోగుల ఆత్మహత్యలను హేళన చేసిన నీచుడివి నువ్
- నీ పతనానికి అఫిడవిట్ రాయడం కూడా తెల్సు మాకు
- నిరుద్యోగుల్లారా, విద్యార్థుల్లారా.. కేటీఆర్ లాంటి గాడిదని తరిమికొట్టండి
- టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ పిలుపు
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: కేటీఆర్ సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటదని.. పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ హెచ్చరించారు. పదేండ్లు కేటీఆర్ భోగాలు తప్ప తెలంగాణ యువత బాధలు పట్టించుకోలేదని విమర్శించారు. పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. తెలంగాణ యువతకు, విద్యార్థులకు చేసిన ఒక్క పని ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ రాజకీయ పతనానికి కూడా అఫిడవిట్ రాయడం మాకు తెలుసన్నారు. ఈమేరకు గాంధీ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కేటీఆర్ యూత్ ఫోబియాతో బాధ పడుతున్నారు. కేటీఆర్ రాజకీయ పతనానికి కూడా అఫిడవిట్ రాయడం తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ అవినీతిపై, కేటీఆర్ తల పొగరుపై తొక్కి తెలంగాణ రాష్టాన్ని విముక్తి చేశారు. పదేండ్లలో యువతకు, విద్యార్థులకు చేసిన ఒక్క పని కేటీఆర్ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రకియ చేపట్టి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగుల కోసం ధర్నా కూడా చేయని దుర్మార్గుడు కేటీఆర్. నిరుద్యోగుల్లారా, విద్యార్థుల్లారా కేటీఆర్ లాంటి గాడిదని తరిమి కొట్టండి అని చనగాని పిలుపునిచ్చారు.
కేటీఆర్ మంత్రిగా ఉండి నిరుద్యోగుల ఆత్మహత్యలను హేళన చేసిన నీచుడు. గ్రూప్-1 అభ్యర్థుల తల్లిదండ్రులు సోమాజీగూడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు చూసి కూడా సిగ్గు తెచ్చుకొని మాట్లాడు కేటీఆర్. రిటైర్డ్ ఉద్యోగులతో పది ఏళ్ళు పాలన చేస్తే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రజా పాలనలో భాగం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది. కేటీఆర్ సిగ్గు తెచ్చుకొని మాట్లకుంటే రాష్ట్రంలో తిరగలేరు అని చనగాని దయాకర్ హెచ్చరించారు..
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
- ●HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
- ●Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు

HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక

Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం



