Harish Rao | కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు : బీఆర్ఎస్ పార్టీ
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాశంమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు స్పష్టం చేసింది.
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాశంమవుతోంది. నేడు సాయంత్రం జగిత్యాలలో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఉన్నప్పటికీ హరీశ్‌రావు హస్తినకు వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు స్పష్టం చేసింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ బృందం ఢిల్లీ వెళ్లినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని వెల్లడించింది. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్నట్లు వివరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Also Read..
జపాన్‌ను కుదిపేసిన శక్తిమంతమైన భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. ప్రజలు బయటకు రావొద్దు
తొలి మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసిన తోషిబా.. అదిరిపోయిన డిస్‌ప్లే, ఆడియో ఫీచర్లు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



