Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో తిరోగమనం వైపు పయనిస్తున్న రాష్ట్రం: హరీశ్ రావు
Harish Rao | ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. కేసీఆర్ (KCR) కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని ఇస్తే, రేవంత్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ చేతకానితనంతో రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తున్నదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి హరీశ్ రావు కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జ్‌షీట్ (Charge Sheet) విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ ఘోర వైఫల్యాలను ఎండగడుతూ చార్జ్ షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు.
`ఆరు గ్యారంటీల పేరుతో బాండు పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ఒక కొత్త రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో కష్టపడి అద్భుతంగా నిర్మించారు. అనేక కార్యక్రమాలతో దేశం నేర్చుకునే విధంగా తొమ్మిదిన్నర ఏండ్లు గొప్ప పాలనను అందించారు. అది తాగునీటి రంగం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు.. ఏ రంగం చూసినా తెలంగాణను (Telangana) దేశానికే ఆదర్శంగా, తలమానికంగా తయారు చేశారు. వ్యవసాయంలో అత్యధిక వరి ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణను అగ్రగామిగా నిలిపారు.

కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అద్భుతమైన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయి. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, విద్యుత్, తాగునీరు, శాంతిభద్రతలు.. ఇలా ప్రతీ వ్యవస్థా కుప్పకూలింది. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఉంటే.. ఈరోజు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో కరెంట్ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితి చూస్తున్నాం. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం.. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా దొరకని దీన స్థితికి దిగజారింది. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పజెబితే.. దాన్ని మరింత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చారు.
పురోగమనం వైపు వేగంగా ప్రయాణం చేయాల్సిన రాష్ట్రం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో తిరోగమనం వైపు పయనిస్తున్నది. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల అన్ని శాఖల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవస్థలను కాపాడాలని, ఆరు గ్యారంటీలు అమలు కావాలని, ప్రజల కష్టాలు తొలగిపోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి మా ఈ పోరాటం కొనసాగిస్తాం.` అని హరీశ్ రావు అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
సెప్టెంబర్ 12, 2026

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
సెప్టెంబర్ 12, 2026

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు



