Apple | యాపిల్ కొత్త బాస్ జాన్ టెర్నస్.. వార్షిక వేతనం ఎంతో తెలుసా..?
Apple | యాపిల్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్‌కు 2027 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5.8 కోట్ల డాలర్ల విలువైన వేతన ప్యాకేజీ లభించనుంది. అదే సమయంలో మాజీ సీఈఓ టిమ్ కుక్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సుమారు 4.7 కోట్ల డాలర్ల పారితోషికం అందుకోనున్నారు.
Apple | యాపిల్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్‌కు 2027 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5.8 కోట్ల డాలర్ల విలువైన వేతన ప్యాకేజీ లభించనుంది. అదే సమయంలో మాజీ సీఈఓ టిమ్ కుక్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సుమారు 4.7 కోట్ల డాలర్ల పారితోషికం అందుకోనున్నారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు సమర్పించిన దాఖలాల్లో యాపిల్ ఈ వివరాలను వెల్లడించింది. జాన్ టెర్నస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇకపై టెర్నస్‌కు వార్షిక ప్రాథమిక వేతనంగా 30 లక్షల డాలర్లు చెల్లించనున్నారు. దీనికి అదనంగా 2027లో లక్ష్య విలువ 5.5 కోట్ల డాలర్లుగా ఉన్న షేర్ల గ్రాంట్‌ను అందుకోనున్నారు. 65 ఏళ్ల టిమ్ కుక్ 15 ఏళ్లపాటు యాపిల్ సీఈవోగా సంస్థకు నాయకత్వం వహించిన అనంతరం బాధ్యతలను 51 ఏళ్ల జాన్ టెర్నస్‌కు అప్పగించారు. కుక్ హయాంలో యాపిల్ కొత్త ఉత్పత్తుల విభాగాల్లోకి విస్తరించడంతోపాటు వార్షిక ఆదాయాన్ని దాదాపు 50 వేల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లింది. ఆయన సీఈవోగా ఉన్న సమయంలో యాపిల్ షేరు విలువ 2,200 శాతానికి పైగా పెరిగింది. ఇది విస్తృత మార్కెట్ వృద్ధితో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ.
ఈ ఏడాదిలో ఎంతంటే..
2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాన్ టెర్నస్‌కు సుమారు 25 లక్షల డాలర్ల విలువైన పరిమిత షేర్ యూనిట్లు ప్రోరేటా ప్రాతిపదికన లభించనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగుస్తుంది. టెర్నస్‌కు ఇవ్వనున్న ఈక్విటీ అవార్డులో 75 శాతం యాపిల్ పనితీరు ఎస్‌అండ్‌పీ 500 సూచీలోని ఇతర సంస్థలతో పోలిస్తే ఎలా ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన 25 శాతం కాల వ్యవధి ఆధారంగా కేటాయించే షేర్ యూనిట్లుగా ఉంటాయి. ఇవి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెస్ట్ అవుతాయి. టిమ్ కుక్ కొత్త బాధ్యతల్లో భాగంగా ఆయన వార్షిక వేతనం 30 లక్షల డాలర్ల నుంచి 20 లక్షల డాలర్లకు తగ్గనుంది. అయితే 2027లో ఆయనకు అందించే షేర్ ప్యాకేజీ లక్ష్య విలువ 4.5 కోట్ల డాలర్లుగా ఉంటుంది. ఇకపై కుక్ పారితోషికం యాపిల్ పనితీరుతో తక్కువగా అనుసంధానమై ఉంటుంది. ఆయన ఈక్విటీ అవార్డులో కేవలం 50 శాతం మాత్రమే ఎస్‌అండ్‌పీ 500తో పోల్చిన యాపిల్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.
7.43 కోట్ల డాలర్లు అందుకున్న టిమ్ కుక్..
2025లో సీఈఓగా ఉన్న సమయంలో టిమ్ కుక్ మొత్తం పారితోషికం 7.43 కోట్ల డాలర్లుగా ఉంది. టెర్నస్, కుక్‌లకు ఇవ్వనున్న కొత్త షేర్ గ్రాంట్ల వాస్తవ విలువ యాపిల్ షేరు ధర ఆధారంగా మారుతూ ఉంటుంది. కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో తాను చాలా కాలం కొనసాగాలని కుక్ ఇప్పటికే వెల్లడించారు. యాపిల్ సంస్థలో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సమయంలో జాన్ టెర్నస్‌కు ఎంత పారితోషికం అందిందో సంస్థ ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే ఆ స్థాయి మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు సాధారణంగా షేర్లు, వేతనం, బోనస్‌లు కలిపి ఏడాదికి సుమారు 2.5 కోట్ల డాలర్ల వరకు చెల్లిస్తారు. తాజాగా దాఖలు చేసిన పత్రాల్లో టెర్నస్, కుక్‌లకు లభించే నగదు బోనస్‌ల వివరాలను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. అయితే సాధారణంగా వీటి విలువ ప్రాథమిక వార్షిక వేతనానికి దాదాపు రెండింతలుగా ఉంటుంది. కాలిఫోర్నియాలోని కుపర్టినో కేంద్రంగా పనిచేసే యాపిల్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రారంభంలో జరిగే షేర్‌హోల్డర్ల సమావేశాలకు ముందు ఎగ్జిక్యూటివ్‌ల పారితోషికానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ధరలు భారీగా పతనం..
- ●Nepal Flash Floods | ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా
- ●Char Dham Yatra | చార్ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
- ●UPI | ఆగస్టులో యూపీఐ రికార్డు.. ఒక్క నెలలోనే 24.51 బిలియన్ లావాదేవీలు..
- ●Wall Posters | డబ్బుల మూటతో సీఎం రేవంత్.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్..

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ధరలు భారీగా పతనం..

Nepal Flash Floods | ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా

Char Dham Yatra | చార్ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?

UPI | ఆగస్టులో యూపీఐ రికార్డు.. ఒక్క నెలలోనే 24.51 బిలియన్ లావాదేవీలు..






