త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిర‌స‌న‌ను విజ‌యంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌

Mahesh Goud | కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఢిల్లీకి వెళ్లి తీరుతామ‌ని, న‌వంబ‌ర్ 1న జ‌రుగ‌నున్న నిరసనను విజయవంతం చేస్తామ‌ని పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మ‌హేశ్ గౌడ్ (Mahesh Goud) స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Oct 28, 2026, 10.21 am IST

Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిర‌స‌న‌ను విజ‌యంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌
Advertisement

Mahesh Goud | త్రినేత్ర న్యూస్‌: కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఢిల్లీకి వెళ్లి తీరుతామ‌ని, న‌వంబ‌ర్ 1న జ‌రుగ‌నున్న నిరసనను విజయవంతం చేస్తామ‌ని పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మ‌హేశ్ గౌడ్ (Mahesh Goud) స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో జరగ‌బోయే నిరసన కార్యక్రమానికి ప్రత్యేక రైళ్లలో వెళ్ల‌డానికి ప్రణాళిక చేస్తే 5 రోజులు ఎలాంటి సమాచారం ఇవ్వ‌ని రైల్వే శాఖ‌.. తీరా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన త‌ర్వాత మంగ‌ళ‌వారం దరఖాస్తును తిరస్కరించింద‌ని మిర్శించారు. రైళ్ల అనుమతి నిరాకరణలో కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉంద‌ని మండిప‌డ్డారు. సీఈసీ జ్ఞాన్‌శ్ కుమార్‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తూ న‌వంబ‌ర్ 1న‌ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో పెద్ద ఎత్తున నిర‌స‌నకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో డీసీసీ అధ్య‌క్షులు, ఫ్రంట‌ల్ చైర్మ‌న్‌ల‌తో మ‌హేశ్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాకిటి శ్రీహ‌రి, ఎంపీ మ‌ల్లు ర‌వి త‌దిత‌రులు పాల్ఒన్నారు.

ఈ సంర్భంగా మ‌హేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఢిల్లీ మీటింగ్‌కు తెలంగాణ (Telangana) నుంచి భారీగా తరలి వెళ్లాల‌న్నారు. దీనికోసం అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. బస్సుల్లో వచ్చే వారికి అన్ని సౌకర్యాల‌ను పీసీసీ ఏర్పాటు చేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), వాకిటి శ్రీహరితో కమిటీ వేశామ‌న్నారు. బస్సు ప్రయాణం 30 గంటలకుపైగా ప‌డుతుంద‌ని, అందువల్ల యువకులు వస్తే బాగుంటుందని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతామ‌ని, నిరసన విజయవంతం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో జరగబోయే వోట్ బచావో, దేశ్ బచావో కార్యక్రమంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు.

Advertisement
Advertisement