Harish Rao | వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కానోడు.. విజన్ 2047 గురించి మాట్లాడుతున్నడు: హరీశ్ రావు
Harish Rao | కుక్క తోక వంకర అనే సామెతను తన వక్ర బుద్దితో ఈ బూతుల సీఎం మరో సారి చాటుకున్నారని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపే తప్ప తెలుపు కాదు అన్నట్టు తన బుద్ధి మారదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: కుక్క తోక వంకర అనే సామెతను తన వక్ర బుద్దితో ఈ బూతుల సీఎం మరో సారి చాటుకున్నారని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపే తప్ప తెలుపు కాదు అన్నట్టు తన బుద్ధి మారదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారు. మా కాంగ్రెస్ తాతలు నేతులు తాగిండ్రు మా మూతుల వాసన చూడమని అన్నట్టు ఉంది ఒరిజినల్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపమంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినట్టు ఉందంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
`గవర్నర్ ప్రసంగం ఓ విజన్ డాక్యుమెంట్‌లా ఉందని సీఎం చెబుతున్నారు. అందులో ఏం విజన్ ఉందో భూతద్దం వెతికినా కనిపించలేదు. ఢిల్లీ ఏఐ సదస్సు గురించి గొప్పగా చెప్పారు. ఆ సదస్సును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది?. రేవంత్ మాట్లాడుతుండగానే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు నిరసన తెలిపారు?. గవర్నర్ ప్రసంగం చర్చలో మీ పాలసిలను ప్రధాన ప్రతిపక్షంగా తప్పుబడితే అది రాజకీయం ఎట్లా అవుతుంది. మేము అధికారంలో ఉండగా కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగం చర్చలో ఏ రాజకీయ చర్చలు చేయలేదా?. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు డిక్లరేషన్ల గురించి నిలదీస్తే జీర్ణించుకోలేక మారీచుడు సుబాహుడు అనే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా మెట్ట వేదాంతం వల్లె వేశాడు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డిని మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా?.
పేదల పాలిట దయ్యంగా మారిన హైడ్రాను దేవతగా చూపించే ప్రయత్నం చేశారు. హైడ్రా రూల్స్ సీఎంకు నచ్చిన వారికి ఒకలా, లేనోళ్లకు ఇంకోలా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇకపై మేము కూడా సీఎం ద్వంద్వ ప్రమాణాలపై అసెంబ్లీలో వీడియోలు చూపిస్తాం. స్పీకర్ అనుమతించాలి.
సీఎంకు కామన్ సెన్స్ లేదు..
మురుగు నీరును శుద్ధి చేసేందుకు ఎస్టీపీలను నాలాలపై కాకుండా ఎక్కడ కడుతారు. సీఎంకు ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. మెట్రో విస్తరణకు అడ్డుపడింది, ఎల్ అండ్ టీని బ్లాక్ మెయిల్ చేసింది రేవంత్ రెడ్డే. ఉల్టా చోర్ కొత్వాల్ ఢాంటే అన్నట్టు ఉంది ఆయన తీరు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు మేము రూపొందించిన మెట్రో ప్రాజెక్టు ను ఎందుకు రద్దు చేశారు?. తొక్కుకుంటూ సీఎం పదవికి వచ్చా అని రేవంత్ రెడ్డే స్వయంగా ఎన్నో సార్లు చెప్పారు. రేవంత్ కు మించిన ఔరంగ జేబు బుద్ది ఇంకెవరికైనా ఉంటుందా?. కేంద్రం చెబితే మెట్రో స్వాధీనం చేసుకున్నానని చెబుతున్న రేవంత్ ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి మెట్రో విస్తరణ ఎందుకు సాధించలేక పోయారు.
నీది చిత్తశుద్ధి లేని శివ పూజ..
ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు రహదారులను ప్రైవేటు అప్పగించిన విషయం ఈ అజ్ఞానికి తెలియనట్టుంది. వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కానోడు విజన్-2047 గురించి మాట్లాడుతున్నారు. నీ మనసు ప్యూర్ లేనప్పుడు క్యూర్, ప్యూర్, రేర్ అని ఎంత మాట్లాడినా ఏం లాభం రేవంత్. చిత్తశుద్ధి లేని శివ పూజ నీది రేవంత్.
రైతు ద్రోహి..
నర్మెట్టలో ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ కేసీఆర్ ఘనత అయితే, తానేదో పొడిచినట్టు రేవంత్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. సన్న బియ్యం అనేది కేసీఆర్ ఆలోచన. మొదట హాస్టళ్లలో అమలు చేశారు. మేము కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. కుటుంబంలో ఎంత మంది ఉన్నా ప్రతి ఒకరికీ ఆరు కిలోలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతుకిచ్చిన హామీలు నెరవేర్చని వాడు రైతును రాజు చేస్తాడా?. హామీలను ఎగ్గొట్టి ఈ రోజు అసెంబ్లీలో రైతులకు ఏదో చేశామని అబద్దాలు మాట్లాడుతున్నాడు. రైతు ద్రోహి రేవంత్.
వైట్ కాలర్, బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడం కాదు. వైట్ కాలర్, బ్లూ కాలర్ నేరాలకు పాల్పడటం నీ నైజం. మేము సోనియాను మెచ్చుకున్న రోజు ఇదే రేవంత్ బలిదేవత అన్నాడు. సోనియా తెలంగాణ ఇచ్చిందని నువ్వనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశావ్. వరి ఎంతైనా పండించొచ్చు కొంటాం అని చెప్పి ఈ రోజు పంట మార్పిడి పేరుతో ధాన్యం కొనుగోళ్లను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ చింపిన విస్తరి కాదు..
బీఆర్‌ఎస్ చింపిన విస్తరి కాదు. తెలంగాణకు శ్రీరామ రక్ష. సోషల్ మీడియాలో లైకులు షేర్‌లకు సీఎంఓ నుంచి డబ్బులిచ్చి ఫేక్ అకౌంట్లు నడుపుతున్న నీవా బీఆర్‌ఎస్ సోషల్ మీడియాను విమర్శించేది. మెస్సీ మ్యాచ్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు. నీ సొంత ప్రచార ఆర్భాటానికి తప్ప ఎందుకు పనికి రాలేదు. హైదరాబాద్‌లో నిరంతరాయంగా కరెంటు ఉండటం కేసీఆర్ ఘనత తప్ప నీ ఘనత ఎక్కడ ఉంది రేవంత్. తెలంగాణ ఉద్యమంలో యువత బలి దానాలకు నీలాంటి తెలంగాణ ద్రోహి తీరే కారణం.
జాబ్ కేలండర్‌కు దిక్కులేదు..
రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ సీటును ప్రియాంకకు ఎందుకు ఇచ్చారు?. వేరే వాళ్ళు దొరక లేదా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు?. నిరుద్యోగులు ఏమైనా ఫర్వా లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 80 వేల ఉద్యోగాలు ఇచామని బొంకుతున్నారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ కేలండర్‌కు దిక్కులేదు. కోచింగ్ సెంటర్లలో నెలల తరబడి వ్యయప్రయాసలకోరుస్తున్న నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సింది పోయి కాకమ్మ కథలు చెబుతున్నారు. ముందుంది నిరుద్యోగుల చేతిలో నీకు మొసళ్ల పండగ.
అప్పులపై గందరగోళం..
అప్పులపై రకరకాల మాటలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 కోట్లు మాత్రమే. కేంద్రం తెలంగాణ అప్పులపై పార్లమెంటులో ఎన్ని సార్లు నిజాలు చెప్పినా సీఎం ఆవే కట్టు కథలు చెబుతున్నారు. రెండేళ్లలోనే రూ.3 లక్షల 47 వేల కోట్ల పైనే అప్పులు తెచ్చామని సీఎం స్వయంగా చెప్పారు. ఈ లెక్కన ఐదేళ్లలో 8 లక్షల అప్పులు దాటుతాయి. అప్పులపై మాట్లాడే నైతిక హక్కు ఉందా?.
ఆర్టీసీకి అపాయింటెడ్ డే ఇవ్వడం చేతకానివాడు.. ఆడ రాక మద్దెల ఓడు అనే రీతిలో మాట్లాడుతున్నాడు. దేశంలోనే తెలంగాణ రైతులకు ఎక్కువ అప్పులు ఉన్నాయని ఒప్పుకున్నారు. పాత చింత కాయ పచ్చడిలా పాడిందే పాడరా అన్నట్టు.. పనికి రాని విషయాలు తప్ప ప్రజలకు పనికి వచ్చే విషయం ఒక్కటి ఈ అబద్దాల కోరు నుంచి రాలేదు. ఓటుకు నోటు దొంగ ఈ రోజు పతివ్రత పోజు కొడుతున్నారు. మతితప్పి అసహనంతో అసెంబ్లీని అనాగరిక భాషతో భ్రష్టు పట్టించిన ఈ సీఎంకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ది చెబుతారు. ఇలాంటి చిచోరా సీఎంను ఏం చేసినా తప్పు లేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



