త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Half-day Schools | తెలంగాణ‌లో మార్చి 16 నుంచి ఒంటిపూట బ‌డులు..!

Half-day Schools | తెలంగాణ వ్యాప్తంగా ప‌రీక్ష‌ల హ‌డావుడి మొదలైంది. మ‌రో వారం రోజుల్లో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ముగిసిన వెంట‌నే పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు.

S

Telangana | Published On Feb 18, 2026, 3.26 pm IST

Half-day Schools | తెలంగాణ‌లో మార్చి 16 నుంచి ఒంటిపూట బ‌డులు..!
Advertisement

Half-day Schools | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా ప‌రీక్ష‌ల హ‌డావుడి మొదలైంది. మ‌రో వారం రోజుల్లో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ముగిసిన వెంట‌నే పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఎండ‌లు కూడా ముదురుతున్నాయి. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఎండ‌లు ముదురుతుండ‌డంతో.. విద్యార్థులంద‌రూ ఒంటిపూట బ‌డుల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మ‌ధ్యాహ్నం భోజ‌నం అందించి విద్యార్థుల‌ను ఇంటికి పంపించ‌నున్నారు.

ప‌ది ప‌రీక్షా కేంద్రాల్లో ఒంటిపూట బ‌డుల టైమింగ్స్ ఇలా..

ప‌ది ప‌రీక్షా కేంద్రాల్లో ఒంటిపూట బ‌డుల టైమింగ్స్ కాస్త మారాయి. ఉద‌యం వేళ ప‌ది ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో.. ఆయా పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే వీరికి పాఠ‌శాల‌కు వ‌చ్చిన వెంట‌నే మ‌ధ్యాహ్న భోజ‌నం అందించ‌నున్నారు. ఆ త‌ర్వాత త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ప‌ది ప‌రీక్ష‌లు పూర్త‌యిన వెంట‌నే వీరికి కూడా ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు.

ఎండాకాలం సెల‌వులు ఎప్ప‌ట్నుంచంటే..?

ఒక‌టి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఏప్రిల్ మూడో వారం నాటికి వార్షిక ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేయ‌నున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వ‌ర‌కు ఎండాకాలం సెల‌వుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. జూన్ 12వ తేదీన తిరిగి పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement