Ponnam Prabhakar | జ్ఞానేశ్‌కుమార్! రాజీనామా చెయ్
Ponnam Prabhakar | ప్రతి ఓటు హక్కు రక్షించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలి. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి. పొన్నం ప్రభాకర్ డిమాండ్. మరిన్ని వివరాలివే..
- ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ప్రతి ఓటు పోకుండా ఉండేదాకా పోరాటం చేస్తాం
- తెలంగాణలో ఓటర్ల హక్కులపై విస్తృత చర్చ జరగాలి
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: ఒక్క అర్హుడి ఓటు కూడా అన్యాయంగా తొలగించకూడదని.. ప్రతి ఓటు పోకుండా ఉండేదాకా పోరాటం సాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం పెంచేలా ఎన్నికల వ్యవస్థ పని చేయాలన్నారు. తెలంగాణలో ఓటర్ల హక్కుల పరిరక్షణపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కు రక్షించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండేలా అధికారులు వ్యవహరించాలి.
ఓటు బచావో - దేశ్ బచావో నినాదంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలుపుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన హక్కు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలను ఎన్నుకునే, మార్చే శక్తి ప్రజల ఓటుకు ఉంది. గతంలో కూడా ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాలన్నదే ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా ఎన్నికల కమిషన్ అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బెంగాల్, బీహార్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలపై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
పేదలు, సామాన్యులు, అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కు రక్షించాలి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాత ధోరణి ఉండాలని కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలకు తమ ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలి.
ఎన్నికల కమిషన్‌పై రాజకీయ పక్షపాతానికి సంబంధించిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పారదర్శక చర్యలు తీసుకోవాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై కూడా ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటర్ల హక్కులను, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఓటు హక్కు కేవలం ఒక హక్కు మాత్రమే కాదు - ప్రజాస్వామ్యానికి పునాది. ఓటును కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.. ఓటు బచావో - దేశ్ బచావో.
తాజావార్తలు
- ●SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియమం ఏమిటి..?
- ●Chanagani Dayakar | ఎంపీపై మార్ఫింగ్ వీడియో.. కొణతం దిలీప్‌ను వెంటనే అరెస్టు చేయండి
- ●INDIA bloc | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్
- ●Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?
- ●KTR | ఈనాడుకు కేటీఆర్ లీగల్ నోటీసులు..!
- ●KTR | నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం

SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియమం ఏమిటి..?

Chanagani Dayakar | ఎంపీపై మార్ఫింగ్ వీడియో.. కొణతం దిలీప్‌ను వెంటనే అరెస్టు చేయండి

INDIA bloc | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్

Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?




