Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన "స్టీల్ బ్యాంక్" కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుందని తెలిపారు.
- గ్రామాల నుంచి హోటళ్ల వరకు సక్సెస్‌గా సాగుతున్న ఉద్యమం
- 276 మహిళా సంఘాలతో ముందుకు.. ఏడాది కాలం పూర్తి
- సంతోషం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన "స్టీల్ బ్యాంక్" కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్‌కు శాశ్వత ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ఆలోచనతో గ్రామ మహిళా సంఘాల ద్వారా ఈ స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశామని వివరించారు. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2.54 కోట్ల సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 276 గ్రామ మహిళా సమైక్య సంఘాలకు మొత్తం 276 స్టీల్ బ్యాంక్ సెట్లను పూర్తిగా ఉచితంగా అందించాం. ఒక్కో సెట్‌లో 13 రకాల స్టీల్ పాత్రలు ఉండేలా, 300, 400, 500 పాత్రల సామర్థ్యంతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేశాం. ఈ కార్యక్రమం ద్వారా 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళా సభ్యులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గతేడాది జూలై 17 ప్రారంభించాం. నేడు పర్యావరణ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది అని మంత్రి పొన్నం చెప్పారు.
గ్రామాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామసభలు వంటి కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగం విస్తృతంగా పెరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారాయి. వాణిజ్య సంస్థల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నియోజకవర్గంలోని 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసి, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులకు శాశ్వత ప్రత్యామ్నాయం కల్పించాం అని మంత్రి వివరించారు.
మహిళా సంఘాలు స్టీల్ బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. ప్రజల్లో బాధ్యత పెరగడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం తగ్గి, పరిశుభ్రమైన జీవన విధానం అలవాటవుతోందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనతో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటడం, చెరువుల అభివృద్ధి, ప్రజా ప్రదేశాల సుందరీకరణ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఎల్లమ్మ, పల్లె, కొత్త చెరువుల పరిసరాల అభివృద్ధి, త్రిశూలం జంక్షన్, గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ, "I Love Husnabad" ప్రదేశం, యోగా లోగోలతో కూడిన డివైడర్లు, ఎల్కతుర్తి చౌరస్తా వంటి ప్రాంతాలు పరిశుభ్రత, పచ్చదనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని, సమాజంలో శాశ్వత మార్పు తీసుకొచ్చే ఆలోచనలే నిజమైన అభివృద్ధి అని పొన్నం అన్నారు. "ప్లాస్టిక్ రహిత గ్రామాల నుంచి ప్లాస్టిక్ రహిత హోటళ్ల వరకు, అక్కడి నుంచి ప్లాస్టిక్ రహిత తెలంగాణ వైపు కొనసాగే ప్రజా ఉద్యమమే స్టీల్ బ్యాంక్ కార్యక్రమం" అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం గ్రామాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చిందని మహిళా సంఘాల ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు పరిశుభ్రంగా మారాయని వివరించారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల అభివృద్ధి పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించామని పేర్కొన్నారు. స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. పాత్రలను అందిస్తూ, వాటిని భద్రపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని మహిళా సంఘాల నాయకులు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
జులై 17, 2026

Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
జులై 17, 2026

Employees Health Scheme | ‘ఈహెచ్ఎస్’ పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
జులై 17, 2026
తాజావార్తలు
- ●FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..
- ●Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు - ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|
- ●Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు
- ●Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు..
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..

Rakul Preet Singh | టాలీవుడ్ హీరోలపై రకుల్ పొగడ్తలు - ఆఫర్ల కోసమే అంటోన్న నెటిజన్లు|

Minister Vivek | 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు

Saroornagar Yuva Sangrama Sadassu | సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్



