TG TET | తెలంగాణ టెట్.. స్వల్పంగా తగ్గిన అప్లికేషన్ ఫీజు
TG TET | నిరుద్యోగులు, విపక్షాల ఒత్తిడితో రెండేండ్ల క్రితం జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం ఉద్యోగాల నియామకాలు జరుగనప్పటికీ.. ఒక నోటిఫికేషన్ మాత్రం షెడ్యూల్ ప్రకారం విడుదలచేస్తున్నది.
TG TET | త్రినేత్ర.న్యూస్: నిరుద్యోగులు, విపక్షాల ఒత్తిడితో రెండేండ్ల క్రితం జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం ఉద్యోగాల నియామకాలు జరుగనప్పటికీ.. ఒక నోటిఫికేషన్ మాత్రం షెడ్యూల్ ప్రకారం విడుదలచేస్తున్నది. ఏటా రెండు సార్లు నోటిఫికేషన్ ప్రకటించి.. పరీక్షలు కూడా నిర్వహిస్తున్నది. అయితే ప్రభుత్వం కొత్తగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయకపోతుండటంతో.. అది కేవలం అర్హత పరీక్షగానే మిగిలిపోతున్నది. అదే టెట్ నోటిఫికేషన్ (TG TET)
ఈ ఏడాది తొలివిడత టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షలను జూన్ 15 నుంచి 30 వరకు నిర్వహించనుంది. అయితే పరీక్ష ఫీజు (Application Fees) విషయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు స్వల్ప ఊరటనిచ్చింది. రూ.50 మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది. బుధవారం నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు (Online applications) అందుబాటులో ఉంటాయి. కాగా, పరీక్షా ఫీజు, సిలబస్, అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 15న విడుదలయ్యే ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో ఉంటాయి.
ఇక టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్ష రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్య తేదీలివే..
- ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
- జూన్ 9 నుంచి హాల్ టికెట్ల జారీ
- జూన్ 15 నుంచి 30 వరకు పరీక్ష నిర్వహణ
- జులై 28 నుంచి 31 వరకు ఫలితాలు విడుదల
- వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in
సంబంధిత వార్తలు

MLA Devireddy Sudhir Reddy | రాహుల్.. కేసీఆర్ ఉద్యోగం పీకెస్తే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్నవ్.. ఏమైంది?: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
మే 16, 2026

Harish Rao | 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే.. సచివాలయం ముట్టడిస్తాం : హరీశ్‌రావు
మే 2, 2026

TET Notification | టెట్ నోటిఫికేషన్ విడుదల.. ఎల్లుండి నుంచి దరఖాస్తులు
ఏప్రిల్ 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



