త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం

Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నిర్వాసిత కుటుంబాల పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

P

Telangana | Published On Sep 21, 2026, 4.58 pm IST

Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం
Advertisement
  • నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి..
  • కలెక్టర్లతో మంత్రులు ఉత్త‌మ్‌, పొన్నం ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌

Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నిర్వాసిత కుటుంబాల పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతి, పునరావాస చర్యలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పరిస్థితిపై జిల్లాలవారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్‌ కేసులపై ఆరా

భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణ, ఇంకా సేకరించాల్సిన భూమి వివరాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల వారీగా భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భూసేకరణతో పాటు ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న కుటుంబాలకు పునరావాసం, పునర్వ్యవస్థీకరణ చర్యలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, ఇతర సౌకర్యాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

క్షేత్రస్థాయి సమస్యలపై ప్రత్యేక చర్చ

ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాస ప్రక్రియలో జిల్లాలవారీగా ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను కలెక్టర్ల నుంచి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ అంశాలపైనా సమావేశంలో సమగ్రంగా చర్చ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజు, ఆర్థిక‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ సందీప్ కుమార్ సుల్తానియా, భూసేకరణ-పునరావాస కమిషనర్‌ శివకుమార్‌ నాయుడు పాల్గొన్నారు. ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ రమేశ్‌బాబు, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement