త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | పెంచుతున్నది భూముల విలువ మాత్ర‌మే.. రిజిస్ట్రేష‌న్ వ్యాల్యూ కాదు: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5 నుంచి భూముల విలువ (Land Value) పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వ‌ద్ద భారీగా ర‌ద్దీ పెరిగింది. ఈ నేప‌థ్యంలో ల్యాండ్ వ్యాల్యూ పెంపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్ప‌ష్ట‌త నిచ్చారు.

G

Telangana | Published On Jun 4, 2026, 5.40 pm IST

Ponguleti Srinivas Reddy | పెంచుతున్నది భూముల విలువ మాత్ర‌మే.. రిజిస్ట్రేష‌న్ వ్యాల్యూ కాదు: మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5 నుంచి భూముల విలువ (Land Value) పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వ‌ద్ద భారీగా ర‌ద్దీ పెరిగింది. ఈ నేప‌థ్యంలో ల్యాండ్ వ్యాల్యూ పెంపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్ప‌ష్ట‌త నిచ్చారు. ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం భూముల విలువ మాత్ర‌మే పెంచుతున్న‌ద‌ని, రిజిస్ట్రేష‌న్ వ్యాల్యూ (Registration Value) కాద‌ని తెలిపారు. రిజిస్ట్రేష‌న్ విలువ పెంచితే.. భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం మ‌ళ్లీ భూసేక‌ర‌నణ చేయాల్సి వ‌చ్చిన్పుడు ఖ‌జానాపై భారం ప‌డుతుంద‌ని చెప్పారు. మీడియాతో ఆయ‌న చిట్‌చాట్ చేశారు.

ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేయ‌డం సాధ్యం కాద‌ని చెప్పారు. ప్రతిపక్ష‌ నేతలు ఏదైనా మాట్లాడుతార‌ని, అది నమ్మొద్దని వ్యాఖ్యానించారు. ఫ్యూట‌ర్ సిటీలో భూములు ఉచితంగా ఇవ్వ‌డంలేద‌ని, ఒకవేళ దానిని ర‌ద్దు చేస్తే అక్క‌డ భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం తిరిగి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. అది సాధ్యమేనా అని ప్ర‌శ్నించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చితీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో తాను, సీఎం రేవంత్‌ స్పష్టత‌తో ఉన్నామ‌ని వెల్ల‌డించారు. మంత్రుల శాఖ‌ల మార్పుపై మాట్లాడుతూ.. తాను ఒక సాధార‌ణ రైతు కుంటుంబం నుంచి వ‌చ్చాన‌ని, ముఖ్య‌మంత్రి త‌న‌కు ఏ శాఖ కేటాయించినా మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేస్తాన‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement