KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్
KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సవాళ్లు చేయడం.. పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు మాత్రమే అలవాటు అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇండ్ల కంటే ఎక్కువగా మేం కట్టి చూపిస్తామని, అప్పుడే ఓట్లు అడుగుతామని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
పారిపోవడం కాంగ్రెస్ నేతలకే అలవాటు
శపథం చేయడం కాదు
చేతనైతే చేసి చూపించాలి
గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు మీరు
కోహినూరులో కాళ్లు పట్టుకొని..
ఢిల్లీకి లొంగిపోయే ఉపాయం మాకు తెల్వదు
KTR | త్రినేత్ర.న్యూస్ : ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సవాళ్లు చేయడం.. పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు మాత్రమే అలవాటు అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఇండ్ల కంటే ఎక్కువగా మేం కట్టి చూపిస్తామని, అప్పుడే ఓట్లు అడుగుతామని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
మాట నిలబెట్టుకునే దమ్ముందా..?
స్వరాష్ట్రాన్ని సాధించాం.. స్వగృహ స్వప్నాలను సాకారం చేశామని తెలిపారు. డబ్బా ఇండ్లు కాదు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామన్నారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని చాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా? శపథం చేయడం కాదు..చేతనైతే చేసి చూపించాలి అని సవాల్ విసిరారు. 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే.. గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతాం అన్న సవాల్‌కు కట్టుబడి వుండాలి పౌరుషం వుంటే అని కేటీఆర్ అన్నారు.
అందమైన పొదరిల్లును నిర్మించి చూపించాం..
హైదరాబాద్ మహా నగరంలో.. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిన ఘనత మాది. 70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదు మేం..మేం కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానం. చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయని సాహసంతో.. 60 ఏండ్లు ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిల్లును నిర్మించి చూపించాం. మీకు చిత్తశుద్ధి వుంటే.. సత్తా వుంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టండి అని కేటీఆర్ సవాల్ విసిరారు.
మాది గృహ నిర్మాణ యజ్ఞం.. మీది గృహ మేధ యాగం
గృహ నిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం మేము.. గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు మీరు. ఇటుకలు పేర్చి ఇండ్లు కట్టింది మేం.. పేదల ఇండ్ల మీద బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు మీరు. వీకెండ్‌లో మంది కొంపలు కూల్చి.. వికృతానందం పొందుతున్న మీరు ఇండ్లు కట్టడం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి కదా. రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని.. పడగొట్టిన ఇండ్లు ఎన్ని.. శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం వుందా? అని నిలదీశారు.
అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు
దీపావళి బాంబులు పేలుస్తామని.. తుస్సుమనిపించిన తుపేల్ మినిస్టర్.. మిస్టర్ బాంబులేటి. మాకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం తెలుసు.. ఆత్మాభిమానంతో బతకడం తెలుసు. మీలాగా.. కోహినూరులో కాళ్లు పట్టుకొని.. ఢిల్లీకి లొంగిపోయి.. కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం మాకు తెల్వదు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు మాకు తెల్వదు. అక్రమ క్రషర్లు నడుపుతూ.. అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు మాకు తెల్వదు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకొని.. భూభారతిలో బ్లాక్ లిస్టులు.. బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే ల్యాండ్ గేమ్స్ తెల్వదు. గూండాలను ఉసిగొల్పి.. సామాన్యులపై దౌర్జన్యాలు చేసి.. భూములను బుక్క పెట్టడం తెల్వదు. బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం తెల్వదు మాకు. మీరెన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా.. డైవర్షన్ డ్రామాలు ఆడినా 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టం. ఆరు గ్యారెంటీల.. 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనండి మీకు దమ్ముంటే అని కేటీఆర్ సవాల్ విసిరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

N Ramachander Rao | తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం : ఎన్ రామచందర్ రావు
మే 28, 2026

Uttamkumar Reddy | హామీ ఇస్తున్నాం.. ప్రతి గింజనూ కొంటాం: రైతులకు మంత్రి ఉత్తమ్ భరోసా
మే 28, 2026

Future City Hyderabad | ఫ్యూచర్ సిటీ పనుల స్పీడ్ పెంచిన రేవంత్ సర్కార్: గ్లోబల్ సిటీలో రాబోయే భారీ మార్పులివే
మే 28, 2026
తాజావార్తలు
- ●Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..
- ●Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!
- ●Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య
- ●Smart Phones | ఫోన్ మరీ అతిగా హీట్ అవుతుందా.. వేసవిలో ఫోన్ పట్ల ఈ జాగ్రత్తలు పాటించండి..
- ●N Ramachander Rao | తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం : ఎన్ రామచందర్ రావు
- ●Tappachabutra Police | కరెంటు షాక్‌తో పడిపోయాడు.. పోలీసులొచ్చి సీపీఆర్ చేశారు.. తర్వాత ఏమైందంటే!

Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..

Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!

Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య

Smart Phones | ఫోన్ మరీ అతిగా హీట్ అవుతుందా.. వేసవిలో ఫోన్ పట్ల ఈ జాగ్రత్తలు పాటించండి..



