RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు చిక్కుకున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి సీఎం వర్గం కాగా, మరొకటి ఆర్ఎం వర్గం అని ఆర్ఎస్పీ విమర్శించారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు చిక్కుకున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి సీఎం వర్గం కాగా, మరొకటి ఆర్ఎం వర్గం అని ఆర్ఎస్పీ విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అన్నదాతల హననం అడ్డూఅదుపు లేకుండా జరుగుతనే ఉన్నది. దీన్ని అడ్డుకుంటాం. ఒక వైపు రైతు బంధు, భీమా, మద్దతు దర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ, మరో వైపు రైతులకు ఉన్న భూములను కూడా బలవంతంగా గుంజుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి వత్తాసు పలుకుతున్నారు కొందరు అధికారులు. మీరు సంతకం పెట్టే ప్రతి ఫైలు రేపు రానున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా పరిశీలించబడుతుంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఒకటి సీఎం వర్గం..రెండోది ఆర్ఎం వర్గం అంట..
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి తదితర హైదరాబాద్ పరిసర జిల్లాలలో ఈ దౌర్జన్యం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. దీని వెనక వినిపిస్తున్న పేర్లు మన ఫోర్ బ్రదర్స్, రెవెన్యూ మంత్రి వర్యులు. హెచ్ఎండీఏ రీజియన్‌లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం అంతా రెండు వర్గాలుగా విడిపోయింది అని అధికారులు చెప్తున్నారు. ఒకటి సీఎం వర్గం..రెండోది ఆర్ఎం వర్గం అంట. లావాదేవీలు, పంపకాలు సరిగా జరగకపోతే వెంటనే తెలంగాణ ఏసీబీని ఉసిగొల్పుతున్నారు. శామీర్‌పేట తహసీల్దార్ ఇటీవలే ఏసీబీ ట్రాప్ కూడా అయింది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ఏసీబీకి ఈ బిగ్ బాసులు ఎందుకు కనిపిస్తలేరో సమజైతలేదు
ఎందుకు ఇంత లంచాలు తీసుకుంటున్నారు అని కొంత మందిని అడిగితే మేం లక్షలు లంచం ఇచ్చి వచ్చాం అని కొందరు చెప్తే, మరి కొంతమంది మాకు బాస్ నుండి టార్గెట్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ల భద్రత దృష్ట్యా పేర్లు చెప్పడం లేదు. అన్ని ఫైళ్లు సరిగా ఉన్నా ఉన్నతాధికారులు ఆర్ఎంతో ఒక మాట చెప్పించండి అని చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఈ అవినీతి నిరోధక శాఖ (ACB) వాళ్లకు ఈ బిగ్ బాసులు ఎందుకు కనిపిస్తలేరో సమజైతలేదు. ఇప్పుడు మీకు దొరుకుతున్న చిన్న చేపలకు(Accused Officers) కు లైడిటెక్టర్ పరీక్షలు చేయండి. అసలు దొంగలు దొరుకుతరు అని సూచించారు.
లంచాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే ఏ అధికారినీ వదలం..
ఇటీవల మా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కూడా పెద్దషాపూర్ రూ. 1000 కోట్ల కుంభకోణాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారు. వెంటనే తేలుకుట్టిన దొంగల్లా అధికారులు మేల్కొన్నారు. మరో వైపు గతంలో రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌లు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసి శామీర్‌పేటలో పలు గ్రామాల్లో వందల ఎకరాల రైతుల భూములను ప్రైవేటు రిసార్టులకు కట్టబెడుతున్నారు మేడ్చల్ జిల్లా అధికారులు. బొమ్రాస్‌పేట లాంటి మరి కొన్ని గ్రామాల్లో రైతుల భూములను రికార్డులు సరిగా లేవంటూ 22A (నిషేధిత భూములు) జాబితాలో చేర్చారు. ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీళ్లు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. వీళ్లందరికీ న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తాం.. లంచాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే ఏ అధికారినీ వదలం. ఈ లాంటి వారికోసం అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కాలాపానీ లాంటి జైలును నిర్మిస్తాం. అందులో మీ ‘బాసులకు’ ప్రత్యేక సౌకర్యాలు ఉండబోతున్నవి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక గెట్ రెడీ.. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ కాంగ్రెస్ నేతలకు ఆర్ఎస్పీ సూచించారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
జూన్ 4, 2026

Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు
జూన్ 4, 2026

Srinivas Goud | సీఎం రేవంత్ ఎండిపోయిన ప్రాజెక్టులు చూడ్డానికి వస్తున్నడు: శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ - తిరుమలలో జాన్వీ కపూర్ సందడి - కాలినడకన శ్రీవారి దర్శనం
- ●Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- ●Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు
- ●Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్లో అప్లై చేయవచ్చు..
- ●Srinivas Goud | సీఎం రేవంత్ ఎండిపోయిన ప్రాజెక్టులు చూడ్డానికి వస్తున్నడు: శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం..!

Janhvi Kapoor | పెద్ది రిలీజ్ వేళ - తిరుమలలో జాన్వీ కపూర్ సందడి - కాలినడకన శ్రీవారి దర్శనం

Chirumarthi Lingaiah | కేసీఆర్‌ను అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Rains | రాబోయే 2 గంటల్లో.. తెలంగాణలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్లో అప్లై చేయవచ్చు..



